ManaEnadu:టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి ఓ లేడీ డాక్టర్‌ను రెండో పెళ్లి చేసుకోబోతున్నాడనే వార్తలు కొంతకాలంగా వినిపిస్తున్నాయి. అయితే ఆ లేడీ డాక్టర్ ఎవరో తెలిసిపోయింది. ఆమెతోనే ఆయన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించనున్నాడు. ప్రస్తుతం ఆయన అనుష్కశెట్టి లీడ్ రోల్ పోషిస్తున్న ‘ఘాటి’ సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. ఓవైపు ప్రొఫెషనల్ వర్క్స్‌లో బిజీగా ఉన్నప్పటికీ మరోవైపు పర్సనల్ లైఫ్‌ను పట్టాలెక్కించే పనిలో పడ్డాడు క్రిష్.
ఆమెకూ రెండో పెళ్లే
క్రిష్ చేసుకోబోయే అమ్మాయి పేరు ప్రీతి చల్లా. ఆమెకు కూడా ఇది రెండో వివాహం. చల్లా హాస్పిటల్స్‌లో ఆమె హాస్పిటల్స్‌లో గైనకాలజిస్ట్, ప్రసూతి వైద్యురాలు, ఫెర్టిలిటీ స్పెషలిస్టుగా పని చేస్తున్నారమె. ఆమె తన కుటుంబంలో ఫోర్త్ జనరేషన్ డాక్టర్ కావడం విశేషం. కాగా వీరి పెళ్లి నవంబర్ 10న జరగనుంది. రిసెప్షన్ కూడా ఇదే నెల 16న జరగనున్నట్లు టాక్. సినీ ప్రముఖులు, ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే క్రిష్ మాజీ భార్య రమ్య కూడా డాక్టర్ కావడం గమనార్హం. వీరికి 2018లో కోర్టు విడాకులు మంజూరు చేసింది.

ఘాటి పనుల్లో బిజీబిజీ
క్రిష్ డైరెక్ట్ చేస్తున్న పాన్ ఇండియా మూవీ ‘ఘాటి’ టీజర్ నిన్న అనుష్కశెట్టి బర్త్ డే సందర్భంగా రిలీజైంది. అది అందర్నీ ఆకట్టుకునేలా ఉంది. క్రిమినల్‌గా మారిన ఓ లేడీ స్టోరీతో ఈ సినిమాను తెరకెక్కించారు. పవన్ సినిమా హరిహరవీరమల్లు దర్శకత్వ బాధ్యతల నుంచి క్రిష్ తప్పుకున్న విషయం తెలిసిందే. ఆ స్థానంలో ఏఎం రత్నం తనయుడు బాధ్యతలు టేకప్ చేశాడు.
Director Krish Jagarlamudi, Priti Challa, Marry






