రూ.5లక్షల రివార్డ్ ప్రకటించిన ‘కన్నప్ప’

భారీ బడ్జెట్ సినిమాల సెట్స్ నుంచి వస్తున్న లీక్‌లు దర్శకనిర్మాతలను ఇబ్బంది పెడుతున్నాయి. నిన్న పుష్ప 2 నుంచి అల్లు అర్జున్, శ్రీలీల ఫొటో లీకైన విషయం తెలిసిందే. కాగా ఈరోజు మంచు విష్ణు నటించిన కన్నప్ప సినిమా వంతయింది. ఈ మూవీలో పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ భాగమైన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే కొంతమంది ఔత్సాహికులు సెట్స్ నుంచి ప్రభాస్ ఫోటోను లీక్ చేశారు. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ నేపథ్యంలో కన్నప్ప టీమ్ రివార్డ్ అనౌన్స్ చేసింది.

వారిని గుర్తిస్తే రూ.5లక్షలు
లీకులతో నిరుత్సాహానికి గురైన మేకర్స్ ఓ ప్రెస్‌నోట్ విడుదల చేశారు. లీక్ అయిన ఫొటో మూలాన్ని గుర్తించిన వారికి రూ.5లక్షల రివార్డుగా ఇస్తామన్నారు. దీంతో పాటు ఈ లీకైన ఫొటోను షేర్ చేయవద్దని విష్ణు మంచు అందరినీ కోరారు. ప్రేక్షకులకు సాటిలేని అనుభూతిని అందించడానికి తమ టీమ్ ఎంతో కష్టపడుతోందని గుర్తు చేశారు. ఈ ఫొటోను షేర్ చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందేకు కన్న టీమ్ సిద్ధమైంది. కాగా ఆ ఫొటోను ఫస్ట్ లీక్ చేసింది ఎవరో గుర్తిస్తే ఆ వివరాలను 24 ఫ్రేమ్స్ ఫిల్మ్ ఫ్యాక్టరీ ట్విటర్‌ అకౌంట్‌కు పంపవచ్చు.

కలల ప్రాజెక్టుకుగా ‘కన్నప్ప’

మంచు విష్ణుకు ‘కన్నప్ప’ కేవలం తొలి పాన్ ఇండియా మూవీ మాత్రమే కాదు. అది అతడి కలల ప్రాజెక్టు. ఎన్నో ఏళ్లుగా ప్లానింగ్ జరుగుతోన్న ఈ సినిమా ఎట్టకేలకు ఇప్పుడు పట్టాలెక్కి షూటింగ్ జరుపుకుంటోంది. ఈ మూవీలో పెద్ద స్టార్లు నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్, మలయాళ సీనియర్ నటుడు మోహన్ లాల్, మోహన్ బాబు, నటి కాజల్ అగర్వాల్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రముఖ పౌరాణిక కార్యక్రమం మహాభారత్‌కు దర్శకత్వం వహించిన ముఖేష్ కుమార్ సింగ్ ఈ చిత్రానికి డైరెక్టర్. మోహన్‌బాబు స్వయంగా నిర్మిస్తున్నారు. ప్రీతి ముకుందన్ కథానాయిక

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *