ManaEnadu: నందమూరి నటసింహం బాలకృష్ణ( Nandamuri Balakrishna) హోస్ట్ గా వ్యవహరిస్తున్న టాక్ షో ‘అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే’ (Unstoppable with NBK). ఈ టాక్ షో సక్సెస్ ఫుల్‌గా నడుస్తున్నది. తాజాగా అన్ స్టాపబుల్ విత్ ఎన్‌బీకే 4వ సీజన్ నాల్గవ ఎపిసోడ్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(
Icon star Allu Arjun) గెస్ట్ గా వచ్చారు. పుష్ప-2(Pushpa-2) మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా అల్లు అర్జున్ ఈ షోలో సందడి చేశారు. ఈ సందర్భంగా బాలయ్య, బన్నీల మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. కాగా ఈ షో ఫుల్ ఎపిసోడ్ ఈనెల 15న స్ట్రీమింగ్ కానుంది.
జాతీయ అవార్డుపై ఆసక్తి రాకపోవడం బాధించింది
ప్రోమోలో సమర సింహారెడ్డి(Samara Simha Reddy) గెటప్‌లో బాలకృష్ణ ఎంట్రీ ఇచ్చారు. ‘వీర సింహారెడ్డి… పుట్టింది పుదిచెర్ల.. చదివింది అనంతపురం.. రూలింగ్ కర్నూల్..’ అంటూ మాస్ డైలాగ్ చెప్పి ప్రేక్షకులలో జోష్ నింపారు. ఆ తర్వాత..’కర్మ సిద్ధాంతాన్ని అవపోసన పట్టిన కార్మికుడు.. ఐకాన్ స్టార్ ఎదిగిన నా స్నేహితుడు’ అంటూ అల్లు అర్జున్‌ను స్టేజీ మీదకు ఆహ్వానించారు బాలయ్య. ఆ సమయంలో బాలకృష్ణ తనదైన స్టైల్ లో ‘తగ్గేదేలే’ డైలాగ్ చెప్పి ప్రేక్షకులను అలరించారు. సినిమా విశేషాలతోపాటు జాతీయ అవార్డు(National Award) అందుకోవడం గురించి మాట్లాడుకున్నారు. తెలుగులో ఒక్కరికి కూడా ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు రాకపోవడం తనని బాధించిందని.. ఎలాగైనా సాధించాలనుకున్నానని అల్లు అర్జున్ తెలిపాడు.
వారికి అన్యాయం జరిగితే కోపం వస్తుంది: బన్నీ
ఆ తరువాత చిరంజీవి, మహేశ్‌బాబు(Chiranjeevi and Mahesh Babu)లతో సహా పలువురు స్టార్స్ ఫొటోలను చూపిస్తూ.. వారిని చూడగానే ఏమి అనిపిస్తుందని బాలయ్య అడిగారు. దీంతో చిరంజీవి, మహేశ్ బాబులతో తనకున్న అనుబంధాన్ని మరోసారి గుర్తు చేసుకున్నాడు అల్లు అర్జున్. ఇక అల్లు అర్జున్ తో బాలయ్య మన ఇద్దరం రిలేటివ్స్(Relatives) అనగా ఎలా అని బన్నీ అడిగితే నేను కృష్ణుడు, నువ్వు అర్జునుడు అని చెప్పారు బాలయ్య. ఆ తర్వాత ‘ మీరు గీత ఇవ్వండి, మేము కురుక్షేత్రం చేస్తాం’ అరి అల్లు అర్జున్ అన్నారు. ఇక అమ్మాయిల విషయంలో అన్యాయం జరిగితే తనకు బాగా కోపం వస్తుందన్నాడు అల్లు అల్లు అర్జున్. ఇలా ఆసక్తికరంగా సాగిన బన్నీ-బాలయ్య ముచ్చట్లను ఈ లేటెస్ట్ ప్రోమో(Latest Promo)లో మీరూ చేసేయండి..






