
ప్రముఖ నటుడు కమల్ హాసన్(Kamal Haasan), దిగ్గజ దర్శకుడు మణిరత్నం(Mani Ratnam) కాంబో వచ్చిన మూవీ థగ్‌లైఫ్(Thug Life). దాదాపు 37 ఏళ్ల తర్వాత వీరిద్దరి కాంబోలో ఈనెల 5న వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్(Box Office) వద్ద భారీ డిజాస్టర్‌గా నిలిచింది. సుమారు రూ.200 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ‘థగ్ లైఫ్’ పూర్తి థియేట్రికల్ రన్(Theatrical run)లో కనీసం అందులో సగం కూడా వసూలు చేయలేకపోయిందని సమాచారం. దీని వలన నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు(Producers, distributors) కలిపి దాదాపు రూ.150 కోట్లకు పైగా నష్టపోయినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో, చిత్ర దర్శకుడు మణిరత్నం సినిమా వైఫల్యంపై స్పందిస్తూ, ప్రేక్షకులకు సారీ(Sorry) చెప్పారు.
ఫస్ట్ షో నుంచే ఫ్లాప్ టాక్
‘నాయకుడు(Nayakudu)’ వంటి చారిత్రాత్మక విజయం తర్వాత ఈ ఇద్దరి కలయికలో వస్తున్న సినిమా కావడంతో ప్రేక్షకులు భారీ ఆశలు పెట్టుకున్నారు. ఎంతో ఉత్సాహంగా థియేటర్లకు వెళ్లిన అభిమానులు, సినిమా చూశాక నిరాశతో వెనుదిరిగారు. భారీ తారాగణం ఉన్నప్పటికీ, కథనం ఆకట్టుకునేలా లేదని పెదవి విరిచారు. ఫస్ట్ షో నుంచే ఫ్లాప్ టాక్ తెచ్చుకొని, కేవలం రూ.18 కోట్లు మాత్రమే వసూలు చేయగలిగింది. రెండో రోజుకే చాలా థియేటర్లు ఖాళీ అయిపోవడంతో, సినిమా పరాజయం ఖాయమైపోయింది. దీనికి తోడు, భాషా వివాదం(Language Issue) కారణంగా ఈ చిత్రం కర్ణాటక(Karnataka)లో విడుదల కాలేకపోవడం కూడా వసూళ్ల(Collections)పై తీవ్ర ప్రభావం చూపింది.
త్వరలో మంచి కథతో మీ ముందుకు వస్తా..
దీంతో తొలిసారిగా మౌనం వీడిన మణిరత్నం, సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయిందన్న నిజాన్ని అంగీకరించారు. “ప్రేక్షకులు మా నుంచి మరో క్లాసిక్ చిత్రాన్ని ఆశించారు. ఆ స్థాయిలో సినిమా లేకపోవడంపై వారికి క్షమాపణలు(Apologies) చెబుతున్నాను. మేమెప్పుడూ ‘నాయకుడు’ కంటే తక్కువ స్థాయి సినిమా చేయాలని అనుకోలేదు. అలాంటి ఉద్దేశం మాకు లేదు, ఎవరూ అలా అనుకోవద్దు. ఎవరైనా ఆ సినిమా కంటే తక్కువ సినిమా చేయాలని అనుకుంటారా? మేము ‘థగ్ లైఫ్’ పై చాలా అంచనాలు పెట్టుకున్నాం. కానీ, మేం అందించిన దానికంటే భిన్నమైన, ఇంకా గొప్ప కథను మీరు మా నుంచి ఆశించారని నాకు అర్థమైంది. తప్పకుండా అలాంటి మంచి కథతోనే మీ ముందుకు వస్తాను” అంటూ మణిరత్నం వివరించారు.
Mani Ratnam Apologizes For Thug Life Failure#politikosvinodam#maniratnam#tollywood#entertainment#thuglife#tollywoodupdates pic.twitter.com/Q4I7stdTgm
— Politikos Vinodham (@Politikos_ET) June 23, 2025