పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. మారుతి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వస్తున్న సినిమా ‘ది రాజాసాబ్’ (The Raja Saab). ఈ సినిమా షూటింగు దాదాపుగా పూర్తయింది. ఈ చిత్రం కోసం రెబల్ స్టార్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమా నుంచి చాలా రోజులుగా ఎలాంటి అప్డేట్స్ లేవు. ఈ చిత్రానికి ఆర్థిక సమస్యలు వచ్చినట్లు నెట్టింట న్యూస్ వైరల్ అయ్యాయి. అయితే తాజాగా ఈ సినిమా గురించి ఓ ఫ్యాన్ సోషల్ మీడియా వేదికగా దర్శకుడు మారుతిని అప్డేట్ ఇవ్వాలని కోరాడు. దానిపై మారుతి క్లారిటీ ఇచ్చాడు.
అసలేం జరిగిందంటే..?
తాజాగా సోషల్ మీడియాలో ఓ నెటిజన్ డైరెక్టర్ మారుతిని ‘ది రాజా సాబ్’ అప్డేట్ గురించి అడిగాడు. కావాల్సినంత టైం తీసుకోండని.. ఔట్ పుట్ సంతృప్తిగా ఉంది అనుకున్నప్పుడే సినిమా రిలీజ్ చేయండని అన్నాడు. కాకపోతే ఈ చిత్రం ఈ నవంబరులో వస్తుందా? వచ్చే ఏడాదా? ఇంకెప్పుడైనా? అన్నది మాత్రం ద్వారా కాస్త సమాచారం ఇవ్వండని కోరాడు. ఆ ఒక్క అప్డేట్ ఇస్తే డార్లింగ్ ఫ్యాన్స్ ఎవరూ మిమ్మల్ని ఇబ్బంది పెట్టరంటూ నెటిజన్ పేర్కొన్నాడు. దీనిపై రాజా సాబ్ డైరెక్టర్ మారుతి (Director Maruthi) స్పందించారు.
కొంచెం ఓపిక పట్టండి
‘‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ (People Media Factory) మీకు ఆ సమాచారం ఇస్తుంది. సీజీ వర్క్ వెరిఫికేషన్ పూర్తయ్యాక నిర్మాతలు ది రాజా సాబ్ రిలీజ్ డేట్ ను ప్రకటిస్తారు. ఈ ప్రాసెస్‌లో ఎన్నో అంశాలు ఇన్వాల్వ్ అయి ఉంటాయి. ఇది ఒక్కరు చేసే పని కాదు. అందుకే కాస్త టైం పడుతుంది. డార్లింగ్ అభిమానులంతా కొంచెం ఓపిక పట్టండి. మీ అంచనాలు అందుకునేలా అందరం కష్టపడుతున్నాం. కొంచెం టాకీ పార్ట్, కొన్ని పాటల చిత్రీకరణ మిగిలి ఉంది. ఇప్పటి వరకూ వచ్చిన కొన్ని స్టూడియో అవుట్‌పుట్ బాగుంది. సాంగ్స్ షూటింగ్స్ పూర్తి కాగానే లిరికల్ వీడియోలు రిలీజ్ చేస్తాం. మా హార్డ్ వర్క్ మీకు చూపించేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను’’ అని మారుతి చెప్పుకొచ్చారు.






