Bun Butter Jam: ఫ్యామిలీ ఆడియెన్స్‌కు పర్ఫెక్ట్ ఎంటర్‌టైన్‌మెంట్.. ‘బన్ బటర్ జామ్’

తమిళంలో సూపర్ హిట్‌గా నిలిచిన ‘బన్ బటర్ జామ్(Bun Butter Jam)’ చిత్రం తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ఆగస్టు 8న శ్రీ విఘ్నేశ్వర ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సి.హెచ్. సతీష్ కుమార్ ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా విడుదల చేస్తున్నారు. రాఘవ్ మిర్దత్(Raghav Mirdat) దర్శకత్వంలో రూపొందిన ఈ ఫన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో రాజు జెయమోహన్(Raju Jayamohan), ఆధ్య ప్రసాద్(Aadhya Prasad), భవ్య త్రిఖ (Divine Trikkha) హీరో హీరోయిన్లుగా నటించారు. సురేష్ సుబ్రమణియన్ నిర్మాణంలో, రెయిన్ ఆఫ్ ఎరోస్ సమర్పణలో ఈ చిత్రం రూపొందింది. తాజాగా ఈ మూవీ టీజ‌ర్‌ను టాలీవుడ్ ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు మెహ‌ర్ ర‌మేష్(Meher Ramesh) విడుద‌ల చేసి సినిమా పెద్ద స‌క్సెస్ కావాల‌ని చిత్ర యూనిట్‌కు అభినంద‌న‌లు తెలిపారు.

ఎంటర్‌టైనింగ్‌గా లవ్ ట్రాక్

టీజర్‌(Teaser)లో చార్లి, శరణ్య పొన్‌వనన్ తమ కొడుకు గొప్పతనం గురించి ఫోన్‌లో చెప్పుకుంటూ నవ్వులు పంచగా, హీరో క్యారెక్టర్‌ను ఫన్నీగా పరిచయం చేశారు. హీరో-హీరోయిన్ మధ్య లవ్ ట్రాక్ ఎంటర్‌టైనింగ్‌గా ఉండి, ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. నివాస్ కె. ప్రసన్న(K Prasanna) సంగీతం, బాబు కుమార్ సినిమాటోగ్రఫీ, హై ప్రొడక్షన్ వాల్యూస్ సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి. సునిశిత ఎమోషన్స్, అన్‌స్టాపబుల్ కామెడీతో ఈ చిత్రం కుటుంబ ప్రేక్షకులకు పర్ఫెక్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్యాకేజీగా నిలవనుంది. మరి మీరూ ఈ మూవీ టీజర్‌ను చూసేయండి.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *