‘పుష్ప2.. ప్లేటు ఇడ్లీ..’ టికెట్‌ ధరలపై RGV ఇంట్రెస్టింగ్ పోస్టు

Mana Enadu : మరికొన్ని గంటల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న సమయం వచ్చేస్తోంది. మరో 24 గంటల్లో ‘పుష్ప2: ది రూల్‌’పై (Pushpa2: The Rule) సినిమా రిలీజ్ కాబోతోంది. డిసెంబరు 5వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా ఈ చిత్రం విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో పుష్ప-2 సినిమా టికెట్ ధరల పెంపునకు ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతించాయి. దీనిపై ఇప్పుడు చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే సెన్సేషనల్ డైరెక్టర్ రామ్‌గోపాల్‌వర్మ (Ram Gopal Varma) తాజాగా ఈ వ్యవహారంపై ఎక్స్ వేదికగా ఓ ఆసక్తికర పోస్టు పెట్టారు.

‘‘సుబ్బారావు అనే ఒకడు హోటల్ పెట్టి.. ప్లేట్ ఇడ్లీ (Idly) ధరను రూ.1000గా నిర్ణయించాడు. అంత ధర పెట్టడానికి కారణం వాడి ఇడ్లీలు మిగతావాటి కంటే చాలా గొప్పవని నమ్ముతున్నాడు. కానీ, కస్టమర్‌కు ఆ ఇడ్లీలు అంత వర్త్ అనిపించకపోతే, వాడు అతడి హోటల్‌కు వెళ్లడు. దాంతో నష్టపోయేది సుబ్బారావు ఒక్కడే తప్ప ఇంకెవరూ కాదు.’’ అంటూ ఆర్జీవీ తన పోస్టులో పేర్కొన్నారు. ఇంకా ఈ పోస్టు ఇలా సాగింది..

‘‘సుబ్బారావు ఇడ్లీ ధర సామాన్యులకు అందుబాటులో లేదు’ అని ఎవరైనా ఏడిస్తే, అది ‘సెవెన్‌స్టార్ హోటల్ సామాన్యులకు అందుబాటులో లేదు’ అని ఏడ్చినంత వెర్రితనం. ఒకవేళ ‘సెవెన్‌స్టార్ హోటల్‌లో యాంబియన్స్‌కి మనం ధర చెల్లిస్తున్నాం’ అని వాదిస్తే, పుష్ప 2 (Pushpa 2 Ticket Price) విషయంలో ఆ క్వాలిటీ అనేదే సినిమా. డెమోక్రటిక్ క్యాపిటలిజం అనేది క్లాస్ డిఫరెన్స్‌ మీదే పనిచేస్తుంది. అన్ని ప్రొడక్ట్స్‌లాగే సినిమాలు కూడా లాభాల కోసమే నిర్మిస్తారు. అంతేకానీ, ప్రజా సేవ కోసం కాదు. లగ్జరీ కార్లు, విలాసవంతమైన భవనాలు, ఖరీదైన బ్రాండెడ్ దుస్తుల ధరలపై ఎలాంటి ఏడుపూ ఏడవనోళ్లు సినిమా టికెట్ ధరల మీదే ఎందుకు ఏడుస్తున్నారు’’ అంటూ ఆర్జీవీ తనదైన శైలిలో పోస్టులో రాసుకొచ్చారు.

‘‘ఇల్లు, తిండి, దుస్తులు ఈ మూడింటి కన్నా ఎంటర్‌టైన్‌మెంట్‌ (Entertainment) ఎక్కువ అవసరమా? అలా అయితే ఈ మూడు నిత్యావసరాల ధరలు బ్రాండింగ్ ఉన్నప్పుడు, ఆకాశాన్ని తాకుతుంటే, ఆకాశం లాంటి ‘పుష్ప 2’ సినిమాకి ఇప్పుడు పెట్టిన రేట్లు కూడా తక్కువే. అలా అనుకొని వారు చూడటం మానేయొచ్చు, లేదా రేట్లు తగ్గాక చూసుకోవచ్చు కదా?మళ్లీ సుబ్బారావు హోటల్ విషయానికొస్తే ఇడ్లీ ధర ఇప్పటికే వర్కౌట్ అయిపోయింది. దానికి ప్రూఫ్ ఏమిటంటే సుబ్బారావు ఏ హోటల్లో కూడా కూర్చునే చోటు దొరకడం లేదు. అన్ని సీట్లు బుక్ అయిపోయాయి’’ అని రామ్ గోపాల్ వర్మ ఓ సుదీర్ఘ పోస్టు పెట్టారు. ప్రస్తుతం ఈ పోస్టు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *