
తమిళ డైరెక్టర్ సెల్వరాఘవన్ (Selvaraghavan) సినిమాలంటే చాలా మంది ఆసక్తి చూపిస్తుంటారు. ఆయన దర్శకత్వంలో 20 ఏళ్ల కింద వచ్చిన యుూత్ఫుల్ ఎంటర్టైనర్ ‘7/జీ బృందావన్ కాలని (7G Brindavan Colony)’. ఈ చిత్రం విడుదల సమయంలో బ్లాక్ బస్టర్ విజయం అందుకున్న విషయం తెలిసిందే. 2004లో తమిళంతోపాటు ఈ మూవీ తెలుగులో విడుదలై సూపర్ హిట్ అయింది. ముఖ్యంగా ఇందులో కన్నుల బాసలు తెలియవులే అనే పాటకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇక అనిత.. అంటూ హీరో పిలిచే తీరుకు క్రేజీ ఫ్యాన్స్ ఉన్నారు. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ఈ సినిమాకు సీక్వెల్ తీస్తున్నట్లు గతంలో మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే.
View this post on Instagram
పార్ట్-2లో ఇది చూస్తారు
తాజాగా ఈ సీక్వెల్ పై దర్శకుడు సెల్వరాఘవన్ అప్డేట్ ఇచ్చారు. ప్రేక్షకుల అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ఉండేలా సీక్వెల్ రెడీ చేస్తున్నామని తెలిపారు. ‘7/జీ బృందావన్ కాలని’ చిత్రానికి వచ్చిన రెస్పాన్స్ చూసి పార్ట్-2 (7G Brindavan Colony 2) తీయాలని ప్లాన్ చేస్తున్నాం. ఇప్పటికే 50 శాతం షూటింగ్ కంప్లీట్ అయింది. పార్ట్ 1 క్లైమాక్స్‌లో కదీర్ (ఒరిజినల్ వెర్షన్‌లో హీరో పాత్ర పేరు)కు జాబ్ రావడం, ఒంటరిగా మిగిలిపోవడం చూశారు కదా.. ఆ తర్వాత 10 ఏళ్లు అతడి లైఫ్ ఎలా సాగిందో సీక్వెల్ లో చూస్తారు. సీక్వెల్‌లో ఏం జరుగుతుందనే దాని గురించి పార్ట్ 1లో క్లూ కూడా ఇచ్చామని చెప్పారు. ఈ సినిమాకు యువన్ శంకర్ రాజా మ్యూజిక్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. అని సెల్వరాఘవన్ చెప్పారు.
ఆ సీక్వెల్ చేయాలని ఆశగా ఉంది
మరోవైపు ‘యుగానికి ఒక్కడు (Yuganiki Okkadu)’ సినిమా సీక్వెల్‌పై కూడా సెల్వ మాట్లాడుతూ.. ‘ఆ సినిమాకు సీక్వెల్ చేయాలని తనకెంతో ఆశగా ఉందని అన్నారు. సినిమాకు సంబంధించిన పనులు ప్రారంభం కాకముందే దానిని అనౌన్స్ చేసి తప్పు చేశానేమో అనిపిస్తుందని తెలిపారు. సీక్వెల్‌లో ధనుశ్ (Dhanush) ప్రధాన పాత్రలో నటిస్తారని.. అలాగే కార్తి లేకుండా ఈ సినిమా ఉండదని అసలు సంగతి చెప్పారు. ఇది చాలా క్లిష్టమైన కథ కాబట్టి బడ్జెట్ ఎక్కువ కావాలని.. అందుకే నిర్మాతల కోసం చూస్తున్నామని చెప్పారు.