నేచురల్ స్టార్ నాని(Nani) హీరోగా, ‘దసరా’ ఫేమ్ శ్రీకాంత్ ఓదెల(Srikanth Odela) డైరెక్షన్‌లో రూపొందుతున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ ‘ది ప్యారడైజ్(The Paradise)’. దసరా బ్లాక్‌బస్టర్ విజయం తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్‌లో వస్తున్న సెకండ్ మూవీ కావడంతో దీనిపై హై ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. ఈ అంచనాలకు మరింత ఊపునిస్తూ, మూవీ ప్రమోషన్స్(Promotions)లో డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల ఒక సరికొత్త పంథాను పరిచయం చేశారు. ఇకపై ఈ సినిమాలోని ప్రతి పాత్రను రెండు వేర్వేరు పోస్టర్ల(Posters) ద్వారా పరిచయం చేయనున్నట్టు ఆయన ప్రకటించారు. ఈ మేరకు తన ఎక్స్(X) ఖాతాలో ఓదెల ఓ పోస్ట్ చేశారు.
ఇకపై ప్రతి పాత్ర పరిచయానికి ఇదే విధానం
“శుక్రవారం (ఆగస్టు 8) రెండు పోస్టర్లు విడుదల చేస్తున్నాం. ఉదయం 10:05 గంటలకు నేను పాత్రను ఎలా ఊహించుకున్నానో చూపిస్తాం. సాయంత్రం 5:05 గంటలకు ఆయన ఎలా మారిపోయారో చూపిస్తాం. ఆయన యాటిట్యూడ్, మా ప్రామిస్ రెండూ కనిపిస్తాయి. మీ ప్రేమ, మా పిచ్చితో మేం వస్తున్నాం” అని పేర్కొన్నారు. ఈ సినిమాలోని ప్రతి పాత్ర పరిచయానికి ఇదే విధానాన్ని అనుసరిస్తామని స్పష్టం చేశారు. ఈ ప్రకటనతో సినిమాపై హైప్ మరింత పెరిగింది.
![]()
మొత్తం 8 భాషల్లో విడుదల
కాగా ప్రస్తుతం ‘ది ప్యారడైజ్’ షూటింగ్(Shooting) శరవేగంగా జరుగుతోంది. ఇటీవలే ఫైట్ మాస్టర్ రియల్ సతీశ్(Fight Master Real Satish) నేతృత్వంలో ఓ భారీ యాక్షన్ ఘట్టాన్ని చిత్రీకరించారు. ఈ సన్నివేశం కోసం విదేశీ స్టంట్ మాస్టర్లు కూడా పనిచేశారని, ఇది సినిమాలో ఓ హైలైట్‌గా నిలుస్తుందని చిత్ర యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. నాని కెరీర్‌లోనే అత్యంత భారీగా ఈ చిత్రాన్ని SLV సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ప్రముఖ హిందీ నటుడు రాఘవ్ జుయల్(Raghav Juyal) ఈ చిత్రంలో విలన్ రోల్ పోషిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ, ఇంగ్లిష్, స్పానిష్ భాషలతో కలిపి మొత్తం 8 భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. వచ్చే ఏడాది మార్చి 26న ఈ మూవీ థియేటర్లలోకి రానుంది.
TOMORROW | Two Posters.
10:05 AM – how I imagined. How he transformed.
5:05 PM – His attitude and our promise.
With your love and with our madness.
We are going all in with #THEPARADISENote: From now on, every character will be introduced through two posters.
— Srikanth Odela (@odela_srikanth) August 7, 2025






