‘#90s మిడిల్ క్లాస్ బయోపిక్’తో అలరించిన మౌళి (Mouli), ‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్’ మూవీతో ఆకట్టుకున్న శివాని నాగారం (Shivani Nagaram) కలిసి యాక్ట్ చేస్తున్న మూవీ ‘లిటిల్ హార్ట్స్’ (Little Hearts). సాయి మార్తాండ్ డైరెక్టర్ గా పరిచయం అవుతున్నారు. ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్ నిర్మిస్తోంది. సెప్టెంబరు 12న ఈ మూవీ థియేటర్స్ లో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మూవీ టీమ్ ‘రాజాగాడికి..’ అంటూ సాగే లిరికల్ వీడియోను గురువారం రిలీజ్ చేసింది. సింజిత్ ఎర్రమిల్లి మ్యూజిక్ అందించారు. కిట్టు విస్సా ప్రగడ సాహిత్యం అందించగా.. సింగర్ సంజిత్ హెగ్దే పాడారు. ‘మన రాజా గాడికి ఈ రోజా దొరుకునా.. సైకిల్ బెల్లుకి ఎవరైనా జరుగునా’ అంటూ సాగే ఈ పాటను మీరూ చూసేయండి.






