Mana Enadu: బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్(Alia Bhatt), వేదాంగ్ రైనా(Vedang Raina) ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ మూవీ ‘జిగ్రా(Zigra)’. ఈ సినిమా అక్టోబర్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘జిగ్రా’ చిత్రాన్ని తెలుగులో ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్(Asian Suresh Entertainment) ద్వారా హీరో రానా దగ్గుబాటి(Rana Daggubati) విడుదల చేస్తున్నారు. ఇప్పటికే పాన్ ఇండియా డైరెక్టర్ SS రాజమౌళి, గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్‌లు విడుదల చేసిన జిగ్రా తెలుగు ట్రైలర్(Jigra Telugu Trailer) అందరినీ ఆకట్టుకుంది. తాజాగా మంగళవారం రాత్రి హైదరాబాద్(HYD)లో ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్(Prerelease event)ను గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, రానా దగ్గుబాటి, సమంత(Samantha) ముఖ్య అథితులుగా హాజరయ్యారు. త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram Srinivas), సమంత చేతుల మీదుగా బిగ్ టికెట్ లాంచ్ చేశారు.

అంతటి క్రేజ్ ఉన్న హీరోయిన్ సమంత: త్రివిక్రమ్
ఈ సందర్భంగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్(South Indian star heroine) సమంతపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమిళం, తెలుగు, మలయాళం ఇలా అన్ని ఇండస్ట్రీల్లోనూ ఒకే విధమైన అభిమానగణం ఉన్న నటుల్లో రజనీకాంత్(Rajinikanth) ఒకరని కొనియాడారు. ఆ తర్వాత అంతటి క్రేజ్ ఉన్న హీరోయిన్ సమంత మాత్రమేనని కొనియాడారు. అది ఆమెపై ఉన్న ప్రేమతో చెబుతున్న మాట కాదన్నారు. ” ఏ మాయ చేసావె’ సినిమా నుంచే సమంత హీరో. ఆమెకు వేరే శక్తి అక్కర్లేదు. తానే ఓ శక్తి.

ఆ సినిమాలన్నీ సూపర్ హిట్
అంతటితో ఆగకుండా సమంత.. మీరు ముంబైలోనే ఉండకుండా అప్పుడప్పుడు హైదరాబాద్(HYD)కి రండి. మీరు సినిమాలు చేయడం లేదని మేం కథలు రాయడం లేదు. మీరు నటిస్తానంటే మేం రాస్తాం. ‘అత్తారింటికి దారేది’లాగా.. సమంత కోసం హైదరాబాద్‌కు రావడానికి దారేది అనాలేమో. అని త్రివిక్రమ్ అన్నారు. అలాగే సమంత రావాలని ట్రోల్ చేయాలి” అని ఫన్నీ కామెంట్స్ చెప్పుకొచ్చారు. కాగా త్రివిక్రమ్‌తో సమంతకు మంచి బాండింగ్ ఉంది. ఆయన తెరకెక్కించిన అత్తారింటికి దారేది, అఆ, S/O సత్యమూర్తి సినిమాల్లో సమంత హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాలన్నీ బాక్సాఫీస్(Boxoffice) వద్ద మంచి హిట్ అందుకున్నాయి.






