The Raja Saab: డైరెక్టర్‌కు చిన్న సర్‌ప్రైజ్.. ‘రాజాసాబ్’ మేకింగ్ వీడియో ఇదిగో

Mana Enadu: రెబల్ స్టార్ ప్రభాస్(Rebel Star Prabhas), డైరెక్టర్ మారుతి(Director Maruti) కాంబోలో రాబోతున్న లేటెస్ట్ మూవీ ‘ది రాజా సాబ్ (The Raja Saab)’. ఈ మూవీలో డార్లింగ్ ప్రభాస్‌కు జోడీగా మలయాళ భామ మాళవిక మోహనన్(Malvika Mohanan) నటిస్తున్నారు. ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్, రిద్దీ కుమార్(Nidhi Aggarwal, Riddy Kumar) కీ రోల్‌లో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ(People’s Media Factory) భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. టీజీ విశ్వప్రసాద్(TG Vishwaprasad) నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. SS Thaman మ్యూజిక్ అందిస్తున్నారు. ఇదిలా ఉండగా ఇప్పటికే ఈ మూవీపై భారీ హైప్ క్రియేట్ అయింది. ఇందులో డార్లింగ్ ప్రభాస్ వింటేజ్ లుక్‌లో రొమాంటిక్ బాయ్‌గా కనిపించనున్నాడు. ఈ మూవీ వచ్చే ఏడాది ఏప్రిల్‌ 10న ప్రేక్షకుల ముందుకురానుంది.

 డైరెక్టర్‌కు ఓ చిన్న సర్‌ప్రైజ్ వీడియో

ఇదిలా ఉండగా డైరెక్టర్ మారుతి బర్త్ డే(Maruti’s birthday) సందర్భంగా మూవీ టీమ్ ఓ చిన్న సర్‌ప్రైజ్ చేసింది. తమ డైరెక్టర్‌కు పుట్టినరోజు గిఫ్ట్‌గా ‘రాజా సాబ్’ నుంచి మేకింగ్ వీడియో(Making video) రిలీజ్ చేసింది. ఇందులోని విజువల్స్‌ ఫ్యాన్స్‌ను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. అంతేకాదు ఈ వీడియోలో ప్ర‌భాస్ న‌వ్వుతూ క‌నిపించాడు. బ్లాక్ అవుట్ ఫిట్‌తో డార్లింగ్ లుక్ అదిరిపోయిందంటూ అభిమానులు(Fans) కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. మరోవైపు రాత్రి జరిగిన పార్టీలోనూ డైరెక్టర్ మారుతి తన డ్యాన్స్‌తో అలరించారు. మూవీ యూనిట్‌తో కలిసి ఆయన కేక్ కట్ చేశారు. అనంతరం వారితో కలిసి మెగాస్టార్ చిరంజీవి రౌడీ అల్లుడు సినిమాలోని సాంగ్‌కు కాలు కదిపారు.

https://twitter.com/Pradeepreddy___/status/1843711056457412952

 ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌గా టీజర్?

కాగా ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన గ్లింప్స్(Glimpse) పోస్టర్ ప్రభాస్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. దీంతో ఈ మూవీ టీజర్‌(Teaser)పై భారీ అంచనాలే నెలకొన్నాయి. అయితే ప్రభాస్ బర్త్ డే(Prabhas Birthday) అయిన అక్టోబర్ 23న ‘రాజా సాబ్’ టీజర్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఫ్యాన్స్ కోసం టీజర్‌ను బర్త్ డే గిఫ్ట్‌గా వదలాలని చిత్ర యూనిట్ భావిస్తోందట. అంతా అనుకున్నట్లు జరిగితే నవంబర్ చివర్లోగా షూటింగ్ కంప్లీట్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. డిసెంబర్ నుంచి ప్రమోషన్స్(Promotions) స్టార్ట్ చేయాలని చూస్తున్నట్లు సమాచారం. మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

 

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *