New Movies: దసరాకి సందడే సందడి.. థియేటర్లోకి వచ్చే సినిమాలివే!

Mana Enadu: దసరా(Dassera) ఫెస్టివల్ హంగామా షురూ అయింది. పట్టణాలు, నగరాల్లో ఉంటోన్న జనం పల్లెబాట పట్టారు. ఇప్పటికే స్కూళ్లకు హాలిడేస్(Holidays) ఇవ్వడంతో కుటుంబ సభ్యులు సొంతూళ్లకు చేరుకున్నారు. నేడో, రేపో ఉద్యోగులూ స్వగ్రామానికి వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. తెలంగాణలో ఓవైపు సద్దుల బతుకమ్మ సంబరాలు.. మరోవైపు దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలతో సందడి నెలకొంది. అంటు ఏపీలోనూ దురమ్మ ఉత్సవాలు కన్నుల పండువగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో సినీ ఇండస్ట్రీ కూడా ఈ ఫెస్టివల్ సీజన్‌ను క్యాష్ చేసుకునేందుకు రెడీ అయింది. ఇప్పటికే యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ‘దేవర’ బాక్సాఫీస్(Box Office) వద్ద సందడి చేస్తుండగా.. తాజాగా మరికొన్ని ఆ లిస్ట్‌లో చేరేందుకు సిద్ధమయ్యాయి. అటు OTTలు సైతం అభిమానులను ఎంటర్టైన్ చేసేందుకు రెడీ అయ్యాయి. మరి ఈ దసరాకి ఏ సినిమాలు థియేటర్లలోకి వస్తున్నాయో ఓ లుక్ వేద్దామా..

 

 వేట్టయన్(Vettayan)
తమిళ వెటరన్ హీరో, సూపర్ స్టార్ రజినీకాంత్(Rajanikanth), జైభీమ్ డైరెక్టర్ టీజే జ్ఞానవేల్(TJ Jnanavel) కాంబోలో తెరకెక్కిన మూవీ వేట్టయన్(Vettayan). మంజు వారియర్, అమితాబ్, రానా దగ్గుబాటి(Rana Daggibati), ఫహాద్ ఫాజిల్ వంటి సూపర్ స్టార్లు కీలకపాత్రల్లో నటించారు. ఈ సినిమా దసరా కానుకుగా అక్టోబర్ 10న విడుదల కానుంది. రియల్ స్టోరీ ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. అనిరుధ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళంలో రిలీజ్ కానుంది.

 విశ్వం (Viswam)
హీరో గోపీచంద్(Gopichand), కావ్యా థాపర్(Kavya Thapar) జోడీగా డైనమిక్ డైరెక్టర్ శ్రీను వైట్ల( Director Sreenu Vaitla) కాంబినేషన్లో వస్తోన్న మూవీ ‘విశ్వం(Viswam)’. ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్, సాంగ్స్‌, ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ దక్కింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, చిత్రాలయం స్టూడియోస్ కాంబోలో ఈ సినిమాను నిర్మించాయి. చైతన్‌ భరద్వాజ్‌ మ్యూజిక్ అందించాడు. వేణు దోనేపూడి, టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 11న థియేటర్స్‌లోకి రాబోతోంది.

 మార్టిన్ (Martin)
కన్నడ హీరో ధృవ్ సర్జా (Dhruva Sarja) హీరోగా నటించిన భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ ‘మార్టిన్(Martin)’. ఏపీ అర్జున్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను వాసవి ఎంటర్ప్రైజెస్, ఉదయ్ కే మెహతా ప్రొడక్షన్స్ బ్యానర్లపై ఉదయ్ మెహతా, సూరజ్ ఉదయ్ మెహతా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీని అక్టోబర్ 11న పాన్ ఇండియా వైడ్‌గా అన్ని భాషల్లోనూ రిలీజ్ చేస్తున్నారు.

 జిగ్రా
బాలీవుడ్ బ్యూటీ ఆలియా భ‌ట్(Alia Bhatt), వేదాంగ్ రైనా(Vedang Raina) ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన లేటెస్ట్ మూవీ ‘జిగ్రా(Zigra)’. ఈ సినిమా అక్టోబర్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘జిగ్రా’ చిత్రాన్ని తెలుగులో ఏషియ‌న్ సురేష్‌ ఎంట‌ర్‌టైన్‌మెంట్(Asian Suresh Entertainment) ద్వారా హీరో రానా దగ్గుబాటి(Rana Daggubati) విడుద‌ల చేస్తున్నారు. డైరెక్టర్ వాసన్ బాలా తెరకెక్కించారు. హిందీతోపాటు తెలుగులోనూ ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు.

 మా నాన్న సూపర్ హీరో
సుధీర్‌ బాబు (Sudheer Babu) కథానాయకుడిగా అభిలాష్‌ రెడ్డి కంకర(Abhilash Reddy Kankara) దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘మా నాన్న సూపర్‌ హీరో’ (maa nanna super hero). ఆర్ణ కథానాయిక. షియాజీ షిండే కీలక పాత్రలో కనిపించనున్నారు. దసరా కానుకగా అక్టోబర్‌ 11న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచాయి.

 జనక అయితే గనక
టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ సందీప్ బండ్ల(Sandeep Bandla) తెరకెక్కించిన ‘జనక అయితే గనక’ దసరా కానుకగా విడుదల కానుంది. ఈ సినిమాతోనే సందీప్ డైరెక్టర్​గా పరిచయం కానున్నారు. యంగ్ నటుడు సుహాస్(Suhas) ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నారు. దిల్ రాజు(Dill Raju) ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తెరకెక్కించారు. ఇందులో సంకీర్తన హీరోయిన్‌గా నటిస్తున్న ఈ కామెడీ డ్రామాను అక్టోబర్ 12న రిలీజ్ చేయనున్నారు.

Share post:

లేటెస్ట్