ManaEnadu:నారా రోహిత్ తొలి సినిమా ‘బాణం’తోనే ప్రేక్షకులని ఆకట్టుకుని హీరోగా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. సినీ ఇండస్ట్రీలో నీట్ అండ్ కామ్ పర్సనాలిటీ మెయింటైన్ చేస్తూ.. వైవిధ్యమైన చిత్రాలను సెలక్ట్ చేసుకుంటూ.. ప్రేక్షకులలో ప్రత్యేక గుర్తింపుని సొంతం చేసుకున్నారు.
చంద్రబాబు తమ్ముడు రామ్మూర్తి నాయుడు కుమారుడే రోహిత్. ‘బాణం’తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. యాక్షన్ డ్రామా ఫిల్మ్‌గా తెరకెక్కిన ఈ చిత్రంతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. 2011లో విడుదలైన ‘సోలో’తో తొలి విజయాన్ని సొంతం చేసుకున్నారు. అనంతరం ‘ఒక్కడినే’, ‘ప్రతినిధి’, ‘రౌడీ ఫెలో’, ‘అసుర’, ‘జో అచ్యుతానంద’ వంటి చిత్రాల్లో నటించారు. 2018లో విడుదలైన ‘వీర భోగ వసంత రాయలు’ తర్వాత దాదాపు ఆరేళ్లు సినిమాలకు దూరంగా ఉన్నారు. ఈ ఏడాది ఆయన నటించిన ‘ప్రతినిధి 2’ విడుదలైంది. ఈ సినిమా చిత్రీకరణ సమయంలోనే నటి సిరీతో ఆయనకు పరిచయం ఏర్పడింది. ఇరు కుటుంబాల పెద్దల అంగీకారంతో వివాహ బంధంలోకి అడుగుపెడుతున్నారు.
నారా రోహిత్ తొలి సినిమా ‘బాణం’తోనే ప్రేక్షకులను ఆకట్టుకుని హీరోగా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. సినీ ఇండస్ట్రీలో నీట్ అండ్ కామ్ పర్సనాలిటీ మెయింటైన్ చేస్తూ.. వైవిధ్యమైన చిత్రాలను సెలక్ట్ చేసుకుంటూ.. ప్రేక్షకులలో ప్రత్యేక గుర్తింపుని సొంతం చేసుకున్నారు.