ManaEnadu:‘దేవర’ మూవీ కలెక్షన్స్‌పై మరో మారు రచ్చ జరుగుతోంది. ఈ సినిమా విడుదలైనప్పటి నుండి.. మేకర్స్ అనౌన్స్ చేస్తున్న కలెక్షన్ల పోస్టర్స్‌పై రచ్చ జరుగుతూనే ఉంది. తాజాగా ఈ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేసిన నిర్మాత నాగవంశీ ‘దేవర’ కలెక్షన్స్‌పై చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
తాజాగా జరిగిన ‘లక్కీ భాస్కర్’ మీడియా సమావేశంలో ‘దేవర’ సినిమా కలెక్షన్స్ పై నాగవంశీ (Naga Vamsi) మాట్లాడుతూ.. ‘దేవర’కు మేము చెప్పిన కలెక్షన్స్‌ను ఎవరైనా నమ్మకపోతే అది మా తప్పుకాదు. కలెక్షన్స్ రిపోర్ట్ రిలీజ్ చేయడం కేవలం అభిమానుల కోసమే. స్టార్ హీరోల అభిమానులను సంతృప్తి పరచటానికే అలా కలెక్షన్స్ విడుదల చేస్తుంటాం. గ్రాస్, షేర్ కలెక్షన్లకు ఉన్న తేడా ఏంటో ఇన్కమ్ టాక్స్ వాళ్లకు బాగా తెలుసంటూ నాగ వంశీ చెప్పుకొచ్చారు. అంటే.. ఓ విధంగా కలెక్షన్ల రిపోర్ట్ అనేది కరెక్ట్ కాదు.. అందరు చేస్తున్నదే కదా.. మేము కూడా చేసింది అనేట్టుగానే నాగవంశీ కామెంట్స్ ఉన్నాయి. దీంతో ‘దేవర’ టార్గెట్‌గా సోషల్ మీడియాలో నాగవంశీ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ఎన్టీఆర్ (Jr NTR) హీరోగా నటించిన దేవర (Devara) సినిమా కలెక్షన్స్ పై తొలినుంచి సోషల్ మీడియాలో రచ్చ జరుగుతోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు జెన్యూన్‌గా వచ్చిన వసూళ్లు.. నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించిన కలెక్షన్స్ విషయంలో అనుమానాలు ఉన్నాయని చర్చ జరుగుతోంది. తక్కువ కలెక్షన్స్ వచ్చినా వాటిని ఎక్కువ చేసి చూపినట్టుగా సోషల్ మీడియాలో కామెంట్స్ కనిపిస్తున్నాయి. ఓ వర్గం అభిమానులు, ‘దేవర’వి ఫేక్ వసూళ్లు (Devara Fake Collections) అంటూ అనేక ఆరోపణలను తెరమీదకి తెచ్చారు. ఇప్పుడీ ఈ ఫేక్ కలెక్షన్స్‌పై నిర్మాత నాగవంశీ కామెంట్స్ అగ్నికి ఆజ్యం పోసినట్లయింది.