Mana Enadu:పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు నిర్మించే పాషనేట్ ఫిల్మ్ మేకర్ అభిషేక్ నామా (Abhishek Nama) డెవిల్: ది బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్‌తో దర్శకుడిగా సక్సెస్ ఫుల్ డెబ్యు చేసిన తర్వాత, తన అప్ కమింగ్ డైరెక్షనల్ వెంచర్ ‘నాగబంధం- ది సీక్రెట్ ట్రెజర్ (Nagabandham) ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేశారు. అభిషేక్ నామా కథ, స్క్రీన్ ప్లే కూడా అందిస్తున్నారు. అభిషేక్ పిక్చర్స్‌తో కలిసి NIK స్టూడియోస్ ప్రొడక్షన్ నంబర్ 1 గా కిషోర్ అన్నపురెడ్డి నిర్మిస్తున్నారు. తారక్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి లక్ష్మీ ఐరా, దేవాన్ష్ నామా సమర్పిస్తున్నారు.
అభిషేక్ నామా డివైన్, అడ్వంచర్ ఎలిమెంట్స్ తో కూడిన పవర్ ఫుల్ స్క్రిప్ట్ రాశారు. తిరువనంతపురం లోని పద్మనాభస్వామి ఆలయంలో నిధి, పూరీ జగన్నాథ ఆలయంలో రత్న భండార్‌ను తెరిచిన తర్వాత గుప్త నిధుల అంశం దేశంలో హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం భారతదేశంలోని 108 విష్ణు దేవాలయాలు నాగబంధం ద్వారా రక్షించబడుతున్నాయి. ఆ 108 విష్ణు దేవాలయాలకు సంబంధించిన నాగబంధం చుట్టూ అ ఈ సినిమా కథ ఉండనుంది. ఇప్పటికే విడుదల చేసిన ఇంట్రో వీడియో ప్రేక్షకులను కట్టిపడేయగా KGFలో తన పాత్రతో పేరు తెచ్చుకున్న అవినాష్ అఘోరాగా కనిపించారు. ఈ చిత్రంలో VFX, ప్రొడక్షన్ వాల్యూస్, టెక్నికల్ స్టాండర్డ్స్ అద్భుతంగా ఉండబోతున్నాయి. ఈ చిత్రానికి సౌందర్ రాజన్ డీవోపీగా పని చేస్తుండగా, అభే సంగీతం అందిస్తున్నారు. కళ్యాణ్ చక్రవర్తి డైలాగ్స్ రాయగా, సంతోష్ కామిరెడ్డి ఎడిటర్. అశోక్ కుమార్ ప్రొడక్షన్ డిజైనర్‌గా వ్యవహరిస్తున్నారు
పెదకాపు’ సినిమాలో తన పవర్ ప్యాక్డ్ యాక్షన్ పెర్ఫార్మెన్స్ తో అందరి ప్రశంసలు అందుకున్న విరాట్ కర్ణ (Virat Karrna) ఈ మూవీలో లీడ్ రోల్ పోషిస్తుండగానభా నటేష్ (Nabha Natesh), ఐశ్వర్య మీనన్ (IshwaryaMenon) ఫిమేల్ లీడ్స్ గా నటిస్తున్నారు. జగపతి బాబు, జయప్రకాష్, మురళీ శర్మ, బి.ఎస్. అవినాష్ ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. భారీ అంచనాలున్న ఈ చిత్రం ఈరోజు టీం, ప్రత్యేక అతిథుల సమక్షంలో ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ముహూర్తం షాట్‌కి క్లాప్ కొట్టారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ కెమెరా స్విచాన్ చేయగా, తొలి షాట్‌కి అజయ్ భూపతి దర్శకత్వం వహించారు. ఆసియన్ సునీల్ స్క్రిప్ట్‌ని మేకర్స్‌కి అందజేశారు.






