Mechanic Rocky: ‘మాస్ కా దాస్’ ఫ్యాన్స్‌కి పండగే.. ఎగ్జైటింగ్ అప్డేట్

ManaEnadu:’మాస్ కా దాస్’ విశ్వక్ సేన్ (Vishwak Sen) హీరోగా నటిస్తోన్న హైలీ యాంటిసిపేటెడ్ మాస్ యాక్షన్, కామెడీ ఎంటర్‌టైనర్ చిత్రం ‘మెకానిక్ రాకీ’ (Vishwak Sen). రవితేజ ముళ్లపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని రామ్ తాళ్లూరి తన SRT ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై నిర్మిస్తున్నారు. ఫస్ట్ లుక్, ఫస్ట్ గేర్, ఫస్ట్ సింగిల్ ఇలా ఇప్పటి వరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ మంచి స్పందనను రాబట్టుకుని సినిమాపై భారీగా అంచనాలను పెంచేశాయి. అయితే సినిమా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నా ఫ్యాన్స్‌కి ఒకటి కాదు రెండు అదిరిపోయే అప్డేట్స్ ఇచ్చారు మేకర్స్. ఇంతకీ అ అప్డేట్స్ ఏంటంటే..

అయితే ఈ సినిమా ట్రైలర్‌ని ఈ నెల 20న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. సినిమాని దీపావళి కానుకగా ఈ నెల 31న విడుదల చేయాల్సి ఉంది కానీ.. కొన్ని అనివార్య కారణాల చేత నవంబర్ 22న విడుదల చేయనున్నారు. దీంతో ‘మాస్ కా దాస్’ విశ్వక్ సేన్ అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. ఇప్పటికే విడుదల చేసిన సాంగ్స్‌లో విజువల్స్ ప్లజెంట్‌గా వున్నాయి.

మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా, శ్రద్ధా శ్రీనాథ్ మరో హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రానికి మనోజ్ కాటసాని సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. సునీల్, నరేష్, హర్ష చెముడు, హర్ష వర్ధన్, హైపర్ ఆదిలతో పాటు రోడీస్ ఫేమ్ రఘు రామ్ కీలక పాత్రలో నటించడం విశేషం. అన్వర్ అలీ ఎడిటర్‌గా, క్రాంతి ప్రియం ప్రొడక్షన్ డిజైనర్‌గా బాధ్యతలు నిర్వహిస్తోన్న ఈ చిత్రానికి సత్యం రాజేష్, విద్యాసాగర్ జె ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్.

Share post:

లేటెస్ట్