రియ‌ల్ స్టోరీతో ఘటికాచలం హ‌ర్ర‌ర్ మూవీ ఫీల్‌.. టీజర్ లాంఛ్ ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్

ManaEnadu: నిఖిల్ దేవాదుల (Nikhil devadula) కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘ఘటికాచలం’(Ghatikachalam). ఇంటెన్స్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ మూవీకి అమర్ కామెపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రభాకర్, ఆర్వికా గుప్తా, జోగి నాయుడు, సంజయ్ రాయ్ చుర, దుర్గాదేవి  కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఒయాసిస్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్‌పై ఎం.సి రాజు నిర్మిస్తున్నారు. దాదాపు చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అయింది. అయితే స్టార్ ప్రొడ్యూస‌ర్ Skn, డైరెక్టర్ మారుతి (Maruthi) ఈ సినిమాను రిలీజ్ చేస్తుండ‌గా తాజాగా సోమవారం సినిమా టీజర్‌ విడుదల చేసి ప్రెస్‌మీట్ నిర్వ‌హించారు. 

హీరో నిఖిల్ దేవాదుల మాట్లాడుతూ.. అమర్ గారు ఎంత ఇంటెన్స్ గా స్టోరీ నెరేట్ చేశారో దాన్ని నా పర్ ఫార్మెన్స్ లో చూపించానని అనుకుంటున్నాను. ఘటికాచలం సినిమా ఒక టీనేజ్ అబ్బాయి, వాళ్ల అబ్బాయి మధ్య జరుగుతుంది. కథలో ఎన్నో ట్విస్ట్ లు, టర్న్స్ ఉంటాయి. అవన్నీ మిమ్మల్ని ఆకట్టుకుంటాయి. ఎస్కేఎన్, మారుతి గారికి చాలా థ్యాంక్స్ క్వాలిటీ కంటెంట్ ను ప్రేక్షకుల దగ్గరకు తీసుకెళ్లడమే పెద్ద పనయ్యింది. అలాంటి టైమ్‌లో వారు ముందుకొచ్చారు. నేను 15 ఏళ్లుగా నటిస్తున్నాను. 60 నుంచి 70 సినిమాలు చేశాను. ఘటికాచలం సినిమా మంచి సక్సెస్ కావాలని కోరుకుంటున్నా అన్నారు.

ఈ సంద‌ర్భంగా సినిమా డైరెక్టర్ అమర్ కామెపల్లి మాట్లాడుతూ.. ఈ సినిమా కాన్సెప్ట్ ను యూఎస్ లో ఉండే నా ఫ్రెండ్ రాజు చెప్పాడు. వాళ్లకు తెలిసిన వారి ఇంట్లో జరిగే కొన్ని ఘటనలు చెప్పాడు. నాకు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. 19 ఏళ్ల మెడికల్ స్టూడెంట్ లైఫ్ లో జరిగిన కథ ఇది. రాజు మనమే ఈ మూవీ చేద్దామని చెప్పారు. అలా ఘటికాచలం సినిమా మొదలైంది. మంచి టీమ్ దొరికింది. డైరెక్ట‌ర్ మారుతి, నిర్మాత ఎస్కేఎన్‌లకు ఈ సినిమా ట్రైలర్ చూపించగా నచ్చి మూవీ కూడా చూసి చిన్న చిన్న మార్పుులు చెప్పారు. త‌ర్వాత వారే మూవీని టేకప్ చేసి రిలీజ్ చేస్తున్నారు. వారికి జీవితాంతం రుణపడి ఉంటా. మా మూవీ టీజర్, ట్రైలర్ నచ్చితేనే మూవీ చూడండి అన్నారు.

Share post:

లేటెస్ట్