లక్కీ భాస్కర్ 2′ పై క్లారిటీ ఇచ్చిన దర్శకుడు వెంకీ అట్లూరి.. ఎప్పుడంటే?

మలయాళీ నటుడు దుల్కర్ సల్మాన్(Dulquer Salmaan) తెలుగులో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు. హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన ‘సీతారామం’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన దుల్కర్, ఆ తర్వాత వెంకీ అట్లూరి(Director Venky Atluri) దర్శకత్వంలో వచ్చిన ‘లక్కీ భాస్కర్'(Lucky Bhaskar) సినిమాతో మరో పెద్ద విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు.

ఈ చిత్రంలో దుల్కర్ సరసన మీనాక్షి చౌదరి(Meenakshi Chowdari) కథానాయికగా నటించింది. ‘లక్కీ భాస్కర్’ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుని పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. దీపావళి సందర్భంగా 2023 అక్టోబర్ 31న విడుదలైన ఈ సినిమాకు జీవీ ప్రకాష్ అద్భుతమైన సంగీతాన్ని అందించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం, పాన్ ఇండియా స్థాయిలో భారీ వసూళ్లను రాబట్టి బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది.

తాజాగా ‘లక్కీ భాస్కర్’ దర్శకుడు వెంకీ అట్లూరి ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ‘లక్కీ భాస్కర్'(Lacky Baskar) సీక్వెల్ గురించి ఆయనకు ప్రశ్న ఎదురైంది. దానికి స్పందిస్తూ, “లక్కీ భాస్కర్ బ్లాక్‌బస్టర్ కావడంతో, ప్రేక్షకుల నుంచి కూడా సీక్వెల్ కోసం చాలా డిమాండ్ వస్తోంది. అందుకే సీక్వెల్ చేయాలని నిర్ణయించుకున్నాను. అయితే, దీనికి కొంత సమయం పడుతుంది” అని వెల్లడించారు.

బయోపిక్‌ల గురించి వస్తున్న సూచనలపై మాట్లాడుతూ, తనకు బయోపిక్‌లు చేయడంలో ఆసక్తి లేదని వెంకీ స్పష్టం చేశారు. “నాకు కుటుంబ ప్రేక్షకులు చూడగలిగే సినిమాలు చేయాలనే ఉంది. ప్రస్తుతం అలాంటి ఒక స్క్రిప్ట్‌పైనే పని చేస్తున్నాను” అని తెలిపారు. ప్రస్తుతం వెంకీ అట్లూరి తమిళ అగ్ర కథానాయకుడు సూర్యతో ఒక సినిమాను తెరకెక్కిస్తున్నారు.

  • Related Posts

    Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

    Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

    ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

    మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *