PEDDI: చెర్రీ-జాన్వీ సినిమాపై బిగ్ అప్డేట్.. జెట్ స్పీడులో ‘పెద్ది’ షూటింగ్

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan), జాన్వీ కపూర్(Janvi Kapoor) జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పెద్ది(Peddi)’. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ టీజర్(Teaser) ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల్లో వైబ్ క్రియేట్ చేసింది. టాలెంటెడ్ దర్శకుడు బుచ్చిబాబు సానా(Bucchibabu Sana) తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తుండగా.. వృద్ధి సినిమాస్ వారు నిర్మాణం వహిస్తు న్నారు. ఇక ఈ చిత్రం కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌కి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చింది. పెద్ది మూవీ షూటింగ్ ప్రస్తుతం లీడ్ నటీనటులతో జెట్ స్పీడ్‌లో దూసుకెళ్తోంది.

Peddi Director On Why He Cast Janhvi Kapoor Opposite Ram Charan: "I Always Wanted A Crazy Heroine In My Film"

వచ్చే ఏడాది మార్చి 27న రిలీజ్‌కు ప్లాన్

ఈ సినిమా అప్పుడే ఏకంగా 55%పైగా కంప్లీట్ అయ్యిపోయిందట. మొన్న మార్చి నాటికి 30% మేర పూర్తి అయ్యిన ఈ చిత్రం ఈ గ్యాప్ లోనే మరో 30% దగ్గరకి వచ్చేసిందని టాక్. మరోవైపు రెహమాన్ తమ హీరోతో చేస్తున్న పెద్ది సినిమాకు ఎలాంటి మ్యూజిక్ ఇస్తారోనని చరణ్ ఫ్యాన్స్ తెగ టెన్షన్ పడుతున్నారు. మణిరత్నం(Maniratnam) లాంటి తలలు పండిన డైరెక్టర్‌కే రెహమాన్ థగ్ లైఫ్ లాంటి ఆల్బమ్ ఇస్తే, కేవలం ఉప్పెన(Uppena) అనుభవం మాత్రమే ఉన్న బుచ్చిబాబుకు ఎలాంటి మ్యూజిక్ ఇస్తారో అని కంగారు పడుతున్నారు. మరోవైపు ఈ నెలలోనే సాంగ్స్ షూట్‌కు వెళ్లనున్నట్టు తెలుస్తోంది. ఇక వచ్చే ఏడాది మార్చి 27న పెద్ద సినిమా రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

Ram Charan-starrer 'Peddi' to release next March

మూవీ క్లైమాక్స్‌లో క్రికెట్ మ్యాచ్..

కాగా ప్రస్తుతం పెద్ది సినిమా మౌలాలి రైల్వే స్టేషన్(Maulali Railway Station) వద్ద షూటింగ్ జరుగుతోంది. ఈ షెడ్యూల్ అయ్యాక నాసిక్ లో కొన్ని సీన్స్ షూటింగ్ చేస్తారట. ఇప్పటికే మైసూరు(Mysore)లో, రామోజీ ఫిలిం సిటీలో వేసిన సెట్స్‌లో షూటింగ్ చేశారు. అయితే పెద్ది సినిమా క్లైమాక్స్‌లో క్రికెట్ మ్యాచ్ ఉంటుందట, అందులో చరణ్ ఆడి గెలిపిస్తాడని టాక్. దీంతో పెద్ది సినిమా క్లైమాక్స్ షూట్‌ని ఢిల్లీలోని అరుణ్ జైట్లీ క్రికెట్ స్టేడియం(Arun Jaitley Cricket Stadium) షూటింగ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారట. ఆ స్టేడియంతో సినిమా షూట్ కోసం చర్చలు జరుపుతున్నారని టాలీవుడ్(Tollywood) సమాచారం. దీంతో పెద్ది సినిమాని భారీగానే ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *