తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎనలేని గుర్తింపు తెచ్చుకున్న యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్(Jr NTR) ఆయనలోని ఎనర్జీ, డెడికేషన్, డైలాగ్ డెలివరీ, డ్యాన్సింగ్ స్కిల్స్ ,నటనతో మాస్, క్లాస్ ఆడియన్స్‌తో పాటు ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. లెజెండరీ నటుడు నందమూరి తారక రామారావు వారసుడిగా సినీ రంగంలోకి వచ్చిన ఎన్టీఆర్, ప్రస్తుతం తెలుగు చిత్రసీమను పాన్ ఇండియా స్థాయికి తీసుకెళ్లే టాప్ స్టార్లలో ఒకడిగా నిలిచాడు.
2013లో ఎన్టీఆర్, దర్శకుడు హరీష్ శంకర్(Harish Shankar) కాంబినేషన్‌లో వచ్చిన ‘రామయ్యా వస్తావయ్యా’ (Ramayya Vasthavayya)చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. మొదటి భాగం ఆసక్తికరంగా సాగినా, రెండో భాగంలో కథనంలో లూప్‌లు ఉండటం సినిమాకు మైనస్‌గా మారింది. దీంతో నిర్మాత దిల్ రాజుకి ఈ సినిమా నష్టాలను మిగిల్చింది.
అయితే, అదే ఈవెంట్‌లో హరీష్ శంకర్ “ఎన్టీఆర్ లాంటి నటుడు మళ్లీ పుడతాడా?” అని ప్రశంసలు కురిపించడంతో ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. పవన్ కళ్యాణ్ వీరాభిమాని అయిన హరీష్ శంకర్, ఎన్టీఆర్ గురించి ఈ స్థాయిలో మాట్లాడడం అభిమానుల ఆనందానికి కారణమైంది.
ప్రస్తుతం, అభిమానులు వీరి కాంబినేషన్ మళ్లీ తెరపై కనిపించాలన్న ఆశతో ఉన్నారు. హరీష్ శంకర్, తారక్ కాంబో ఒక బిగ్ బ్లాక్ బస్టర్ అందించాలన్నది వారి ఆకాంక్ష. ఎన్టీఆర్ ఇప్పటికే వరుస సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ, భవిష్యత్‌లో ఈ కాంబో రిపీట్ అవుతుందన్న ఆశాభావం అభిమానుల్లో ఉంది.
జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. వార్ 2(War2) సినిమాతో బాలీవుడ్ ప్రేక్షకులను మంత్రముగ్దులను చేయబోతున్నాడు. ఆ తర్వాత దేవర 2(Devara2) షూటింగ్ స్టార్ట్ చేయనున్నాడు. అలాగే ప్రశాంత్ నీల్(Prashanth Neel) డైరెక్షన్‌లో రూపొందుతున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్‌లో డిఫరెంట్ గెటప్‌లో కనిపించనున్నాడు.






