జార్జియాలోని బటుమీలో జరుగుతున్న ఫిడే మహిళల ప్రపంచ కప్ (FIDE Women’s World Cup 2025)లో భారత చెస్ స్టార్ దివ్య దేశ్‌ముఖ్(Indian chess star Divya Deshmukh) చరిత్ర సృష్టించింది. 19 ఏళ్ల ఈ ఇంటర్నేషనల్ గ్రాండ్ మాస్టర్ సెమీఫైనల్‌లో మాజీ ప్రపంచ ఛాంపియన్ చైనా ప్లేయర్ టాన్ జాంగీ(Tan Zhongyi)ని 1-0 పాయింట్ల తేడాతో ఓడించింది. దీంతో ఈ టోర్నమెంట్ ఫైనల్‌కు చేరిన తొలి ఇండియన్ ఉమెన్ ప్లేయర్‌గా రికార్డు సృష్టించింది. ఈ విజయంతో ఆమె 2026 క్యాండిడేట్స్ టోర్నమెంట్‌కు అర్హత సాధించి, తన తొలి గ్రాండ్‌మాస్టర్ నార్మ్‌ను కూడా సాధించింది.
తెల్లపావులతో ఆడి విజయం
మొదటి గేమ్‌లో బ్లాక్ పీసెస్‌తో డ్రా సాధించిన దివ్య, రెండో గేమ్‌లో వైట్ పీసెస్‌తో అలాపిన్ సిసిలియన్ డిఫెన్స్ ఆడుతూ టాన్‌పై ఒత్తిడి చేసి విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఇరు ఆటగాళ్లు పొరపాట్లు చేసినప్పటికీ, టాన్ 90వ ఎత్తులో చేసిన తప్పు దివ్యకు విజయాన్ని అందించింది. ఆమె ఈ టోర్నమెంట్‌లో రెండో సీడ్ జు జినర్, హరిక ద్రోణవల్లిని ఓడించి సెమీస్‌కు చేరిన సంచలన ప్రదర్శన కనబరిచింది.
.@DivyaDeshmukh05 becomes the first-ever Indian woman to advance to a FIDE Women’s World Cup Final
@Humpy_Koner to play tie-breaks against Tingjie
Read more📖https://t.co/BNOpGrFFv0
— ChessBase India (@ChessbaseIndia) July 23, 2025
రెండో సెమీస్‌లో హంపి గెలిస్తే..
ఇదిలా ఉండగా.. గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి(Koneru Humpy) రెండో సెమీఫైనల్ చైనాకు చెందిన లీ టింగీతో డ్రా అయింది. ఇప్పుడు ఆమె టై-బ్రేక్ ఆడనుంది. ఈ ఇద్దరు క్రీడాకారిణులు ఈ రోజు రాపిడ్, బ్లిట్జ్ టై-బ్రేక్ గేమ్స్(Blitz tie-break games) ఆడతారు. దీని ద్వారా ఫైనల్‌లో రెండో స్థానం ఎవరికి లభిస్తుందో తెలుస్తుంది. ఇందులో గెలిచిన విజేతతో దివ్య దేశ్‌ముఖ్ ఫైనల్ ఆడుతోంది. ఒకవేళ హంపీ విజయం సాధిస్తే, ఫైనల్‌లో ఇద్దరు భారతీయులు తలపడే అరుదైన ఘట్టం ఆవిష్కృతం కానుంది. కాగా దివ్య విజయం భారత మహిళల చెస్‌లో కొత్త అధ్యాయాన్ని రాసిందని ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆమెను ప్రశంసించారు. యువ చెస్ ఆటగాళ్లకు ఆమె స్ఫూర్తిదాయకమని అన్నారు.






