Rishabh Pant: గాయంతో విలవిల్లాడిన పంత్.. ఆసుపత్రికి తరలింపు

మాంచెస్టర్‌(Manchester Test)లో ప్రారంభమైన భారత్, ఇంగ్లండ్ టెస్ట్(India vs England) మ్యాచ్‌లో మొదటి రోజు రిషబ్ పంత్(Rishabh Pant) తీవ్రంగా గాయపడి రిటైర్డ్ హార్ట్‌(Retired Heart)గా వెనుదిరిగాడు. చివరి సెషన్‌లో క్రిస్ వోక్స్(Chris Vokes) వేసిన బంతిని పంత్‌(37 రన్స్) రివర్స్ స్వీప్ చేయడానికి ప్రయత్నించాడు. కానీ, బంతి బ్యాట్ ఎడ్జ్‌కు త‌గిలి పంత్ కుడి కాలు పాదాని(Right foot)కి బ‌లంగా తాకింది. షూ తీసి చూడ‌గా పాదం న‌లిగిపోయింది. పాదం నుంచి రక్తం(Blood) కారడం కనిపించింది. ఫిజియో వ‌చ్చి చికిత్స చేస్తుండ‌గా పంత్ నొప్పితో విలవిల్లాడిపోయాడు. దీంతో పంత్ రిటైర్డ్ హర్ట్‌గా మైదానం వీడాడు. తన కాలును నేలపై పెట్టడానికి ఇబ్బంది పడ్డాడు. అత‌న్ని మొబైల్ అంబులెన్స్‌లో తీసుకెళ్లారు. పంత్‌ను స్కానింగ్ కోసం ఆసుప‌త్రి(Hospital)కి తీసుకెళ్లిన‌ట్టు జట్టు మేనేజ్మెంట్ తెలిపింది.

Rishabh Pant injury fourth test India and England Photos14

పంత్ జ‌ట్టుకు దూర‌మైతే భార‌త్‌కు భారీ ఎదురుదెబ్బే..

గాయం తీవ్ర‌త ఎక్కువ‌గానే ఉన్న‌ట్లు క‌నిపిస్తుండ‌డంతో అత‌డు మిగతా మ్యాచ్‌లు ఆడ‌డంపై అనుమానాలు నెల‌కొన్నాయి. ఒక‌వేళ పంత్ జ‌ట్టుకు దూర‌మైతే భార‌త్‌కు భారీ ఎదురుదెబ్బే. లార్డ్స్‌(Loard’s)లో జరిగిన మూడో టెస్ట్‌లో కీపింగ్ చేస్తున్నప్పుడు పంత్ వేలికి గాయమైన విష‌యం తెలిసిందే. దాంతో అత‌డు ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో కీపింగ్ చేయ‌లేక‌పోయాడు. అతని స్థానంలో ధ్రువ్ జురెల్(Dhruv Jurel) వికెట్ కీపింగ్ చేశాడు. కాగా ఈ సిరీస్‌లో పంత్ ఇప్పటివరకు అద్భుత ప్ర‌ద‌ర్శ‌న‌తో ఆక‌ట్టుకున్నాడు. ఆరు ఇన్నింగ్స్‌లలో 70.83 సగటుతో 425 పరుగులు చేశాడు. రెండు సెంచరీలు, రెండు అర్ధ సెంచరీలు బాదాడు. గాయం తీవ్రమైనదిగానే కనిపిస్తుండటంతో పంత్ మళ్లీ బ్యాటింగ్‌కు దిగుతాడో? లేదో? అని అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *