పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. భారీ బడ్జెట్ సినిమాలతో బిజీగా గడుపుతున్నాడు. ప్రభాస్ సినిమాలకే కాదు, లైఫ్ స్టైల్ విషయంలోనూ తనదైన ముద్ర వేసుకుంటున్నాడు. గత పదేళ్లలో ప్రభాస్ క్రేజ్, ఫేమ్ అంతర్జాతీయ స్థాయిలో విస్తరించింది. సినిమాల్లో ఓవైపు హిట్లు సాధిస్తూనే, మరోవైపు వ్యక్తిగతంగా కూడా ప్రభాస్ సంపద ఎక్కువవుతోంది.
‘బాహుబలి’ సిరీస్ ప్రభాస్ కెరీర్లో గేమ్‌చేంజర్‌గా మారింది. ఈ సినిమా తర్వాత ప్రభాస్ స్థాయి రెట్టింపు అయింది. దేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకునే హీరోల్లో ఒకడిగా నిలిచాడు డార్లింగ్ ప్రభాస్. టాలీవుడ్ హీరో అయినప్పటికీ, బాలీవుడ్ ఖాన్‌లను మించిన క్రేజ్‌ను సంపాదించుకున్నాడు.
గత పదేళ్ల కాలంలో ప్రభాస్ నేమ్, ఫేమ్ ప్రపంచవ్యాప్తంగా పెరుగుతూ వస్తోంది. లగ్జరీ లైఫ్ స్టైల్ తో పాటు ఖరీదైన ఇళ్లు, కార్లు కూడా అంతే రిచ్‌గా మారాయి. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని పాష్ ఏరియాలో ఉన్న విలాసవంతమైన ఇంట్లో ప్రభాస్ నివసిస్తున్నాడు. ఆ ఇంట్లో లగ్జరీ ఇంటీరియర్స్, ఇండోర్ స్విమ్మింగ్ పూల్, ప్రైవేట్ గార్డెన్, హైఎండ్ జిమ్ వంటి అన్ని సౌకర్యాలున్నాయి. ముఖ్యంగా ఆ జిమ్‌లో రూ.1.5 కోట్ల విలువైన ఫిట్నెస్ పరికరాలు ఉండడం స్పెషల్ అట్రాక్షన్. ఇంకా, ప్రభాస్‌కు 84 ఎకరాల్లో ఫామ్ హౌస్, ముంబైలోనూ ఓ లగ్జరీ ఇంటిని ఆయన సొంతం చేసుకున్నారు.
ప్రభాస్ లగ్జరీ కార్లను చాలా ఇష్టపడతాడు. ఆయన గ్యారేజ్‌లో ఉన్న కార్ల లిస్టు చూదాం
రేంజ్ రోవర్ స్పోర్ట్స్ – ₹1 కోటి
ఆడి A6 – ₹60 లక్షలు
బిఎండబ్ల్యూ 7 సిరీస్ – ₹2 కోట్లు
మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్ – ₹2 కోట్లు
జాగ్వార్ XJ – ₹1 కోటి
లంబోర్గిని అవెంటడార్ – ₹3.5 కోట్లు
రోల్స్ రాయిస్ ఫాంటమ్ – ₹8 కోట్లు
ఇలాంటి లైఫ్‌స్టైల్‌తో పాటు, ప్రభాస్ ఫోర్బ్స్ ఇండియా సెలబ్రిటీల జాబితాలో స్థానం సంపాదించడం విశేషం.






