హరి హర వీరమల్లు రన్‌టైమ్‌ ఎంతో తెలుసా..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Hari Hara Veera Mallu) ప్రధాన పాత్రలో రూపొందుతున్న ప్రతిష్టాత్మక పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్ చిత్రం ‘హరి హర వీరమల్లు’ ఇప్పుడు తెరపైకి రానుంది. దర్శకులు క్రిష్ జగర్లమూడి(Krish jagarllamudi) మరియు జ్యోతి కృష్ణ(Jyothi Krishna) ఈ చిత్రాన్ని ఎంతో గ్రాండ్‌గా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను రెండు భాగాలుగా రూపొందించనున్నారు. ఇప్పటికే నిర్మాత ఏ.ఎం. రత్నం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించగా, మొదటి భాగానికి ‘హరి హర వీరమల్లు: పార్ట్ 1 Sword vs Spirit’ అనే టైటిల్‌ ఖరారు చేశారు.

ఈ చిత్రాన్ని జూలై 24న భారీ ఎత్తున ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. విడుదల తేదీ సమీపిస్తుండటంతో సినిమాకు సంబంధించి విశేషాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. తాజాగా ఓ ఓవర్సీస్‌ టికెట్ బుకింగ్‌ ప్లాట్‌ఫామ్‌ ద్వారా సినిమా రన్‌టైమ్‌ 2 గంటల 40 నిమిషాలుగా ఉండబోతుందని సమాచారం బయటకు వచ్చింది. అయితే దీనిపై ఇంకా అధికారిక ధృవీకరణ రావాల్సి ఉంది. అయినా, ఈ న్యూస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఏఎం రత్నం నిర్మిస్తున్న ఈ చిత్రంలో సంగీతం ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి(M.M keeravani) అందిస్తున్నారు. పవన్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్(Nidhi Agarwal) హీరోయిన్‌గా నటిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఇందులో ‘వీరమల్లు’ అనే పోరాట యోధుడి పాత్రలో కనిపించనున్నారు. ట్రైలర్‌లోనే ఆయన లుక్ ఫ్యాన్స్‌ను మెస్మరైజ్ చేసింది. ముఖ్యంగా ఇంటర్వెల్‌, పోస్ట్ ఇంటర్వెల్‌, క్లైమాక్స్‌ సన్నివేశాలు సినిమాకు హైలైట్స్‌గా నిలవనున్నాయని సమాచారం.

17వ శతాబ్దం నేపథ్యంగా సాగే ఈ కథను తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయనున్నారు. సినిమాలో బాబీ దేవోల్, అనుపమ్ ఖేర్, నోరా ఫతేహి, విక్రమ్ జీత్, జిషు సేన్ గుప్త తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *