సెలబ్రిటీలు పబ్లిక్ ప్లేస్‌లో కనిపించగానే అభిమానులు, ఫోటోగ్రాఫర్లు వారి వెంటపడటం సాధారణమే. సెల్ఫీలు, ఆటోగ్రాఫ్‌లు, వీడియోలు ఇలా హడావుడి మొదలవుతుంది. కొంతమంది నటులు ఈ ప్రేమను ఓపికగా ఎదుర్కొంటారు, అయితే కొంతమందికి మాత్రం అది అసహనానికి దారి తీస్తుంది. తాజాగా గ్లామర్ డాల్ ప్రగ్యా జైస్వాల్‌కు కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
ఇటీవల ఓ పార్టీకి హాజరైన ప్రగ్యా జైస్వాల్(Pragya Jaiswal )ను అక్కడున్న ఫోటోగ్రాఫర్లు ఒక్కసారిగా చుట్టుముట్టారు. ఆమెను వెంటాడుతూ ఫోటోలు తీసేందుకు పోటీపడ్డారు. ఈ హడావిడితో అసహనం చెందిన ప్రగ్యా, ఫోటోగ్రాఫర్లపై అలక వ్యక్తం చేసింది. అసలు స్పందించకుండానే చిరాకు తెచ్చుకుని అక్కడి నుంచి వెళ్లిపోయింది. వీడియోలో ఆమె ముఖానికి వచ్చిన భావాలు ఈ విషయం స్పష్టంగా తెలిపాయి. ప్రస్తుతం ఈ సంఘటనపై నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు.
కొంతమంది ఫోటోగ్రాఫర్లు ప్రైవసీని గౌరవించాల్సిందే అంటూ వారి వైఖరిని తప్పుపడుతున్నారు. మరోవైపు, కొందరు మాత్రం “పబ్లిక్ ప్లేస్‌లో అలాంటి డ్రస్సుతో వచ్చి, కెమెరాలు చూస్తే అసహనం ఎందుకు?” అంటూ ప్రగ్యానే తప్పు చేశారని వ్యాఖ్యానిస్తున్నారు.
View this post on Instagram
ప్రగ్యా జైస్వాల్ తెలుగు పరిశ్రమలో డేగ సినిమాతో అడుగుపెట్టింది. కానీ కంచె సినిమాతో మంచి గుర్తింపు వచ్చింది. అనంతరం కొన్ని సినిమాల్లో నటించినా, ‘అఖండ’ చిత్రంతోనే పెద్ద బ్రేక్ వచ్చింది. ఇటీవల డాకు మహారాజ్ సినిమాలోనూ కనిపించింది. సినిమాలకంటే యాడ్స్, ఫ్యాషన్ ఈవెంట్లలో ఎక్కువగా కనిపించే ఈ ముద్దుగుమ్మ, సోషల్ మీడియాలో తన గ్లామర్ ఫోటోషూట్లతో ఫ్యాన్స్‌ని ఆకట్టుకుంటోంది.






