హీరో వరుణ్ తేజ్(Varun Tej) ప్రస్తుతం సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. 2014లో ముకుంద(Mukunda) చిత్రంతో సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన వరుణ్ తేజ్, వరుసగా విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. కంచె, ఫిదా, తొలి ప్రేమ, ఎఫ్2, ఎఫ్3, గద్దలకొండ గణేష్ సినిమాలు మాత్రమే హిట్ ని అందుకున్నాయి. మట్కా ఆశించిన స్థాయిలో నిలవకపోవడంతో వరుణ్ కొంత గ్యాప్ తీసుకున్నాడు వరుణ్ తేజ్.
ఇప్పుడు తన 15వ సినిమాతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ చిత్రానికి గాంధీ మేర్లపాక(Gandi Merlapaaka) దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతానికి సినిమా పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. తాజా సమాచారం ప్రకారం, సినిమాలో హీరోయిన్‌గా రితిక నాయక్‌ను ఎంపిక చేసినట్టు టాక్ వినిపిస్తోంది.
View this post on Instagram
రితిక నాయక్(Ritika Nayak) గతంలో అశోకవనం లో అర్జున కళ్యాణం చిత్రంలో నటించి గుర్తింపు పొందింది. ఆ సినిమాలో హీరోయిన్ విశ్వక్ సేన్ సోదరిగా కనిపించిన ఈ అందాల భామ తన అభినయంతో ఆకట్టుకుంది. అయితే ఈ ముద్దుగుమ్మకు ఆశించిన ఫలితం రాలేదు. ఇప్పుడు వరుణ్ తేజ్ సినిమాతో ఆమెకు మంచి అవకాశంగా మారే ఛాన్స్ కనిపిస్తోంది.
ఇక రితిక, తేజ సజ్జతో కలిసి నటిస్తున్న మిరాయ్ చిత్రంలో కూడా భాగమవుతోంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ ముద్దుగుమ్మ పోస్ట్ చేసే ఫోటోలు యువతను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.






