ManaEnadu: ప్రపంచ దేశాలన్నింటికీ అగ్రరాజం అమెరికా(America) ఓ పెద్దన్న. అందుకే అన్ని దేశాలకు ఈ దేశాధ్యుడినే ప్రపంచాధినేతగా అభివర్ణిస్తుంటారు. అంతటి పవర్‌ఫుల్ పదవి యూఎస్ ప్రెసిడెంట్(American President) పోస్ట్. ఈ పదవిలో ఉన్న వారికి సకల సౌకర్యాలతో పాటు ఏ దేశానికి వెళ్లినా ఫుల్ సెక్యూరిటీ(Security) ఉంటుంది. మరి అలాంటి రాయల్ లైఫ్(Royal Life) అంటే ఎలా ఉంటుంది? అతనికి లభించే సదుపాయాలు ఎలా ఉంటాయి? అమెరికా అధ్యక్షుడికి జీతం ఎంత ఉంటుంది? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..
24/7 పటిష్ఠ భద్రత
అమెరికా అధ్యక్షుడికి సకల సౌకర్యాలతో వైట్ హౌస్(White House)లో వెలకట్టలేని జీతంతో పాటు 24గంటలూ అతడిపై ఈగ కూడా వాలకుండా చూసుకునే భద్రత ఉంటుంది. ఇక అమెరికా అధ్యక్షుడికి సంవత్సరానికి 4 లక్షల డాలర్ల జీతం(Salary) దక్కుతుంది. ఇది ఇండియన్ కరెన్సీ ప్రకారం రూ.3.3 కోట్లు. ఈ మొత్తాన్ని అమెరికా కాంగ్రెస్ 2001లో నిర్ణయించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఇదే జీతాన్ని ఇస్తున్నారు. అలాగే అమెరికా అధ్యక్షుడిగా రిటైరయ్యాక వార్షికంగా 2 లక్షల డాలర్లు లభిస్తుంది. 1 లక్ష డాలర్లు అలవెన్సు రూపంలో లభిస్తుంది.
వైట్ హౌస్ నుంచే పాలన
ఇది కాకుండా ప్రెసిడెంట్ అధికారిక ఖర్చుల(Official expenses) కోసం ఏడాదికి 50 వేల డాలర్లు ఇస్తారు. దీనికి ఎటువంటి పన్నూ(No Tax) ఉండదు. ఇవి కాక ప్రయాణ ఖర్చుల కోసం మరో లక్ష డాలర్లు, వినోదం కోసం మరో 19 వేల డాలర్లు అందుతుంది. ఈ మొత్తాలన్నీ కలిపితే ఏటా అధ్యక్షుడికి లభించేది 5.69 లక్షల డాలర్ల పైమాటే. అధ్యక్షుడిగా శ్వేతసౌధంలోకి అడుగు పెట్టే ముందు వారికి కావల్సినట్టు ఇంటిని మార్చడానికి మరో లక్ష డాలర్లు అదనంగా ఇస్తారు. ఇక అమెరికా అధ్యక్షుడికి వైట్ హౌస్‌లోనే నివాసం ఉంటారు. పరిపాలనా అక్కడి నుంచే చేస్తారు. వైట్ హౌస్ మొత్తం ఆరు అంతస్తుల భవనం(White House is a six-story building). ఇందులో 132 గదులు, 35 బాత్‌రూమ్‌లు ఉన్నాయి. ఇందులోనే టెన్నిస్ కోర్ట్, జాగింగ్ ట్రాక్, మూవీ థియేటర్(Tennis court, jogging track, movie theater), స్విమ్మింగ్ పూల్ వంటివి ఉంటాయి. అధ్యక్షుడికి విందు కోసం నిత్యం ఐదుగురు చెఫ్‌లు పనిచేస్తుంటారు.








