డార్లింగ్ ప్రభాస్ తల్లికి ఇష్టమైన సినిమా ఏంటో తెలుసా! ఆ సినిమా ఆమెకు చాలా స్పెషల్..

రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పటిదాకా ఎన్నో బ్లాక్‌బస్టర్ చిత్రాల్లో నటించాడు. బాహుబలి సినిమా ఆయనను ప్రపంచ స్థాయిలో పాన్ ఇండియా స్టార్‌గా మార్చింది. సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్, సలార్ వంటి సినిమాలతో ప్రేక్షకులను మెప్పించిన ప్రభాస్, ప్రస్తుతం కల్కి 2898 ఎ.డి, “ది రాజాసాబ్”, “సలార్ పార్ట్ 2” లాంటి భారీ చిత్రాలతో బిజీగా ఉన్నాడు.

తాజాగా ప్రభాస్ తల్లికి అత్యంత ఇష్టమైన చిత్రం ఏంటి అనేది ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. స్టార్ హీరోలకు కోట్లాది మంది అభిమానులు ఉన్నా తమ తల్లిదండ్రుల ప్రశంసలే వారికి ఎంతో ప్రత్యేకం. తల్లిదండ్రులకు తమ కుమారుడు యావత్ దేశంలో గుర్తింపు పొందితే, ఆ గర్వం మాటల్లో చెప్పలేనిది. అయితే తాజాగా ప్రభాస్ తల్లి ఇచ్చిన అభిప్రాయాలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.

ఇప్పటివరకు ప్రభాస్ తల్లి తన కుమారుని సినిమాల గురించి పబ్లిక్‌గా పెద్దగా మాట్లాడలేదు. ఎప్పుడూ మీడియాకు దూరంగా ఉండే ఆమె… కొన్ని ఫ్యామిలీ ఫంక్షన్‌లలో మాత్రం తన మనసులో మాటను బయటపెట్టినట్లు తెలుస్తోంది. ఆమెకు ప్రభాస్ నటించిన సినిమాలన్నింటిలోకీ అత్యంత ఇష్టమైన చిత్రం మాత్రం “ఈశ్వర్” అని తెలిపింది.

2002లో వచ్చిన ఈ సినిమా ప్రభాస్‌కి తొలిచిత్రం. అప్పుడే ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్ అమాయకపు లుక్స్, డైలాగ్ డెలివరీ, యాక్షన్ సీన్స్ అన్నీ ఎంతో ఆకర్షణీయంగా ఉన్నాయని, తాను ఎప్పుడూ “ఈశ్వర్” సినిమాను చాలా ఇష్టంగా చూసేదానినని, అదే తనకు ఫేవరెట్ మూవీ అని ఆమె స్వయంగా బయటపెట్టారట. ఇప్పుడు ఈ విషయాలు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లోకి వచ్చాయి. అభిమానులు కూడా “ప్రభాస్ మదర్ చాయిస్ ఈశ్వర్” అంటూ పోస్ట్‌లు చేస్తూ ఈ స్టోరీని వైరల్ చేస్తున్నారు.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *