టాలీవుడ్ నటి, మెగా ఫ్యామిలీ కోడలు లావణ్య త్రిపాఠి ఇంట్లో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆమె ఎంతో ప్రేమగా పెంచుకున్న పెంపుడు కుక్క మరణించింది. ఈ విషాదాన్ని ఆమె స్వయంగా సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.

లావణ్య తన పెట్ డాగ్ ఫోటోలను షేర్ చేస్తూ, ” నా అత్యంత ముద్దుల కూతురు నువ్వు, నా జీవితంలో కలిసిన బెస్ట్ గర్ల్ నువ్వే, నువ్వు ఎంతో మంచిదానివి, నన్ను నన్నుగా అంగీకరించిన స్వచ్ఛమైన హృదయం నీది, నా జీవితం లో నువ్వు ఒక ప్రత్యేకమైన అధ్యాయం… నీ ప్రేమ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. రెస్ట్ ఇన్ పీస్ బేబీ” – అంటూ లావణ్య భావోద్వేగాలతో షేర్ చేశారు.

లావణ్య త్రిపాఠి 2023 నవంబర్‌లో మెగా హీరో వరుణ్ తేజ్‌ను వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం సినిమాలకు గ్యాప్ ఇచ్చిన ఆమె, త్వరలో తల్లి కాబోతున్నారు. ఈ సమయంలో ఆమెకు ఎంతో దగ్గరైన పెంపుడు కుక్కను కోల్పోవడం ఆమెను మరింత బాధకు గురిచేసింది. ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు ఆమెకు సానుభూతి తెలియజేస్తూ, “ఓం శాంతి” అంటూ కామెంట్లు చేస్తున్నారు.

లావణ్య ‘అందాల రాక్షసి’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. మొదటి సినిమాతోనే ఆమె తన నటనకు మంచి ప్రశంసలు అందుకుంది. తర్వాత ‘దూసుకెళ్తా’, ‘భలే భలే మగాడివోయ్’, ‘సోగ్గాడే చిన్నినాయనా’, ‘శ్రీరస్తు శుభమస్తు’ వంటి సినిమాల్లో నటించి తనకంటూ ఓ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకుంది. ముఖ్యంగా ‘భలే భలే మగాడివోయ్’ చిత్రం ఆమె కెరీర్లో కీలక విజయంగా నిలిచింది.

ఆ తర్వాత వరుణ్ తేజ్‌తో కలిసి నటించిన ‘మిస్టర్’, ‘అంతరిక్షం’ చిత్రాలు మోస్తరు సక్సెస్ సాధించాయి. వీటి షూటింగ్ సమయంలోనే వారిద్దరి మధ్య ప్రేమ చిగురించి, ఆ బంధం వివాహంగా మారింది. ఇటీవల ‘సతీ లీలావతి’ అనే సినిమాలో నటించింది లావణ్య. కానీ ప్రెగ్నెన్సీ కారణంగా ఈ సినిమా విడుదల వాయిదా పడే అవకాశముందని టాక్ వినిపిస్తోంది.






