
అమెరికా(America) అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత డొనాల్డ్ ట్రంప్(Donald Trump) అనూహ్య నిర్ణయాలతో ప్రపంచ దేశాలకు షాకిస్తున్నారు. ఆయన ఇటీవల ప్రకటించిన భారీ టారిఫ్(Tariffs)లు ఇవాళ్టి (ఆగస్టు 1) అమలులోకి వచ్చాయి. ఈ టారిఫ్‌లు అమెరికా వాణిజ్య లోటును తగ్గించడం, దేశీయ తయారీని ప్రోత్సహించడం, జాతీయ భద్రతను రక్షించడం కోసమేనని ఆయన పేర్కొన్నారు. ఈ రోజు నుంచి, అన్ని దేశాల నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై అమెరికా 10% బేస్‌లైన్ టారిఫ్(Baseline tariffs) విధించనుంది. అయితే 92 దేశాలకు సంబంధించి ఉన్నత స్థాయి టారిఫ్‌లు (15% నుంచి 41% వరకు) అమలవుతాయి.
భారత్‌పై 25 శాతం సుంకం
ఇవి గత శతాబ్దంలో లేని స్థాయిలో ఈ టారిఫ్స్ ఉన్నాయి. జపాన్(Japan), దక్షిణ కొరియా, వియత్నాం వంటి దేశాలతో కొన్ని వాణిజ్య ఒప్పందాలు కుదిరలేదు. దాంతోపాటు చాలా దేశాలు ఇంకా చర్చలు కొనసాగిస్తున్నాయి. ఈ టారిఫ్‌లు అమెరికా వినియోగదారులపై 49%, వ్యాపారాలపై 39% భారం వేస్తాయని గోల్డ్‌మన్ సాచ్స్(Goldman Sachs) అంచనా వేసింది. అమెరికాకు మిత్రదేశంగా ఉంటున్న భారత్(India)పై కూడా 25 శాతం వరకు సుంకం విధిస్తున్నట్లు ఇటీవల ప్రకటించారు. ఈ టారిఫ్‌లు కొన్ని దేశాలకు నేటి నుంచే అమల్లోకి వస్తాయి. అయితే ట్రంప్ ప్రపంచ దేశాల్లో ఏయే దేశాలపై ఎంత సుంకం విధించారో చూద్దాం.
ఏ దేశంపై ఎంత శాతం టారిఫ్స్ అంటే..
☛ 41% సుంకాలు: సిరియా
☛ 40% సుంకాలు: లావోస్, మయన్మార్ (Burma)
☛ 39% సుంకాలు: స్విట్జర్లాండ్
☛ 35% సుంకాలు: ఇరాక్, సెర్బియా
☛ 30% సుంకాలు: అల్జీరియా, బోస్నియా, హెర్జెగోవినా, లిబియా, దక్షిణాఫ్రికా
☛ 25% సుంకాలు: భారతదేశం, బ్రూనై, కజకిస్థాన్, మోల్డోవా, ట్యునీషియా
☛ 20% సుంకాలు: బంగ్లాదేశ్, శ్రీలంక, తైవాన్, వియత్నాం
☛ 19% సుంకాలు: పాకిస్తాన్, మలేషియా, ఇండోనేషియా, కంబోడియా, ఫిలిప్పీన్స్, థాయిలాండ్
☛ 18% సుంకాలు: నికరాగ్వా
☛ 15% సుంకాలు: ఇజ్రాయెల్, జపాన్, టర్కీ, నైజీరియా, ఘనా
☛ 10% సుంకాలు: బ్రెజిల్, యునైటెడ్ కింగ్‌డమ్, ఫాక్లాండ్ దీవులు
☛ కాగా యూరోపియన్ యూనియన్(EU) విషయానికొస్తే, 15% కంటే ఎక్కువ US సుంకాల రేట్లు ఉన్న వస్తువులకు కొత్త సుంకాల నుంచి మినహాయింపు ఇచ్చారు.
( @realDonaldTrump – Truth Social Post )
( Donald J. Trump – Jul 31, 2025, 10:54 PM ET )“Trump escalates Canada tariffs to 35% while setting new tariff rates for dozens of other countries”
White House cites Canada’s failure to help curb illicit drug i… pic.twitter.com/oUl84UaCe5
— Donald J Trump Posts TruthSocial (@TruthTrumpPost) August 1, 2025