Liquor Bottles: మద్యం బాటిల్ తిరిగిస్తే రూ.20 రీఫండ్.. ఎక్కడో తెలుసా?

మద్యం తాగిన తరువాత బాటిళ్ల(Liquor Bottles)ను ఎక్కడారెక్కడ విసిరేస్తారు. దీంతో అన్ని చోట్ల ప్లాస్టిక్ బాటిళ్లు విస్తృతంగా కనిపిస్తున్నాయి. ఈ సమస్యను ఎదుర్కొనేందుకు కేరళ ప్రభుత్వం(Kerala Govt) కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇక నుంచి ప్రతి మద్యం బాటిల్ కొనుగోలుపై అదనంగా రూ.20 డిపాజిట్ వసూలు చేయనుంది. ఆ బాటిల్ తిరిగి అదే స్టోర్‌లో ఇచ్చినప్పుడు ఈ డిపాజిట్ మళ్లీ కస్టమర్‌కు తిరిగి చెల్లించబడుతుంది. కేరళ ప్రభుత్వం తెలిపిన వివరాల ప్రకారం, రాష్ట్రంలో బేవరేజెస్ కార్పొరేషన్(Beverages Corporation) ద్వారా సంవత్సరానికి సుమారు 70 కోట్ల సీసాల మద్యం విక్రయమవుతుంది. ఈ సీసాలు రాష్ట్రంలో ప్రధాన ప్లాస్టిక్ వ్యర్థాల(Plastic wastege) మూలాలు కావడంతో సమస్య తీవ్రంగా ఉంది.

Tipsy Christmas: Liquor worth Rs 154 crore sold in Kerala - Tipsy  Christmas: Liquor worth Rs 154 crore sold in Kerala -

వచ్చే నెల నుంచి పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభం

మొత్తం అమ్ముడవుతున్న బాటిళ్లలో కేవలం 56 కోట్ల సీసాలు మాత్రమే రీసైకిల్(Recycle) అవుతున్నాయి. మిగతా భాగం వ్యర్థంగా పరివర్తనవుతున్నది. దీనిని తగ్గించడానికి ఈ కొత్త విధానం అమలులోకి తెచ్చినట్టు ప్రభుత్వం తెలియజేసింది.ఈ విషయం గురించి కేరళ ఎక్సైజ్ శాఖ(Kerala Excise Department) మంత్రి ఎం.బి. రాజేశ్ వివరించారు. మద్యం కోసం గాజు సీసాలపై ఎక్కువ దృష్టి పెట్టాలని సూచించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది పూర్తిగా సాధ్యం కాకపోవడం వల్ల రూ.800 పైగా ధర ఉన్న మద్యం గాజు సీసాల్లో మాత్రమే అందించాలని, రూ.800 కంటే తక్కువ ధర ఉన్న మద్యం ప్లాస్టిక్ బాటిళ్లలో సరఫరా చేయవచ్చని చెప్పారు. సెప్టెంబర్ నెలలో కొన్ని ప్రాంతాల్లో పైలట్ ప్రాజెక్టుగా దీన్ని ప్రారంభించి, జనవరి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకాన్ని అమలు చేయనున్నట్టు ప్రకటించారు. ఇదే విధానాన్ని తమిళనాడు(Tamilnadu) రాష్ట్రం ముందుగా అనుసరించింది.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *