Donald Trump: ఆ 12 దేశాల ప్రజలు అమెరికాకు రావొద్దు.. ట్రంప్ సంచలన నిర్ణయం

రెండోసారి అధికారంలోకి వచ్చిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) సంచలన నిర్ణయాల పరంపర కొనసాగుతోంది. తాజాగా 12 దేశాలకు షాక్ ఇచ్చారు. ఆ దేశ పౌరులు ఇకపై అమెరికాకు రావొద్దని నిషేధం (Travel Ban on Countries) విధించారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులపై బుధవారం ఆయన సంతకం చేశారు. కొలరాడోలో ఇటీవల యూదులపై జరిగిన దాడి నేపథ్యంలోనే ట్రంప్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

అఫ్గాన్, ఇరాన్, లిబియా…

అఫ్గానిస్థాన్‌, ఇరాన్‌, యెమెన్‌, మయన్మార్‌, సోమాలియా, సూడాన్‌, ఈక్వెటోరియల్‌ గినియా, చాద్‌, కాంగో, ఎరిట్రియా, హైతీ, లిబియా, దేశాలు ఈ నిషేధ జాబితాలో ఉన్నాయి. వీటితోపాటు ఏడు దేశాలపై పాక్షిక నిషేధం విధించారు. వెనెజువెలా, తుర్కమేనిస్థాన్‌, బురుండి, క్యూబా, లావోస్, సియెరా లియోన్‌, టోగో దేశాలు ఈ లిస్ట్లో ఉన్నారు. ఈ నిషేధాజ్ఞలు వచ్చే సోమవారం నుంచి అమల్లోకి వస్తాయని వైట్‌హౌస్‌ అధికారులు తెలిపారు.

అమెరికాలో అలాంటి ఘటనలు జరగనివ్వం

‘కొలరాడోలోని బోల్డర్‌ కౌంటీలో (colorado boulder county Terror Attck) ఇటీవల ఉగ్రదాడి జరిగింది. సరైన పత్రాలు లేని విదేశీ పౌరులు దేశంలో ఉండటం కారణంగానే మన మాతృభూమిలో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. 2017లో యూరప్‌లో జరిగిన విధంగా అమెరికాలో జరగనివ్వం. సురక్షితం కానీ దేశాల నుంచి బహిరంగ వలసలను ఇక అనుమతించలేము. అందుకే ఈ రోజు యెమెన్‌, సోమాలియా, హైతీ, లిబియాతో సహా పలు దేశాల ప్రయాణికులపై నిషేధం విధించే ఉత్తర్వులపై సంతకం చేస్తున్నా’ అని ట్రంప్‌ వెల్లడించారు. అయితే ట్రంప్‌ చేసిన ఈ నిషేధానికి చట్టపరమైన సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *