Bengaluru Stampede: తొక్కిసలాట ఘటన.. ఆర్సీబీపై కేసు నమోదు

ఆర్సీబీ విజయోత్సవాల సంబర్భం బెంగళూరు(Bengaluru)లోని చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాటలో (Bengaluru stampede) 11 మంది మృతిచెందిన విషయం తెలిసిందే. కాగా ఘటనపై ఆర్సీబీతోపాటు ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థ డీఎన్‌ఏ ఎంటర్‌టైన్‌మెంట్‌ నెట్‌వర్క్స్‌, కర్ణాటక క్రికెట్‌ అసోసియేషన్‌(కేఎస్‌సీఏ) సహా తొక్కిసలాటతో సంబంధం ఉన్న పలువురిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. సమాచార హక్కు కార్యకర్త స్నేహమయి కృష్ణ ఇచ్చిన ఫిర్యాదుపై కబ్బన్‌ పార్క్‌ పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయగా కేసు నమోదైంది.

Virat Kohli & more: Full list of players retained by RCB ahead of IPL 2024  auction

కర్ణాటక ప్రభుత్వం సీరియస్​

ఈ ఘటనపై కర్ణాటక ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. బెంగళూరు పోలీస్‌ కమిషనర్‌తో పాటు తొక్కిసలాటతో సంబంధం ఉన్న ఇతర పోలీస్‌ ఉన్నతాధికారులపై సస్పెన్షన్‌ వేటు పడింది. ఇందుకు సంబంధించి సీఎం సిద్ధరామయ్య (Siddaramaiah) గురువారం సాయంత్రం ఆదేశాలు జారీ చేశారు. ఆర్సీబీ ప్రతినిధులతో పాటు డీఎన్‌ఏ ఈవెంట్ మేనేజ్‌మెంట్‌ ఏజెన్సీ, కర్ణాటక క్రికెట్‌ అసోసియేషన్‌ ప్రతినిధులను తక్షణమే అరెస్ట్ చేయాలని డీజీపీ, ఐజీపీలను ఆదేశించారు.

దర్యాప్తునకు ఏకసభ్య కమిషన్ ఏర్పాటు

ఈ మేరకు మంత్రివర్గ సమావేశం అనంతరం సిద్ధిరామయ్య మీడియాతో మాట్లాడారు. తొక్కిసలాట ఘటనపై క్యాబినెట్‌ సమావేశంలో చర్చించినట్లు సీఎం సిద్ధరామయ్య తెలిపారు. ఘటనపై దర్యాప్తు చేసేందుకు విశ్రాంత హైకోర్టు జడ్జి నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ఈ కమిషన్‌ 30 రోజుల్లో నివేదిక సమర్పిస్తుందన్నారు. కబ్బన్‌ పార్క్‌ పోలీస్‌ స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌, స్టేషన్‌ హౌస్‌ మాస్టర్‌, స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌, ఏసీపీ, సెంట్రల్‌ డివిజన్‌ డీసీపీ, క్రికెట్‌ స్టేడియం ఇన్‌ఛార్జి, అదనపు పోలీస్‌ కమిషనర్‌, నగర పోలీస్‌ కమిషనర్‌ను తక్షణమే సస్పెండ్‌ చేస్తూ ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *