ఓడితే మళ్లీ పోటీ చేయను.. ట్రంప్ కీలక నిర్ణయం

ManaEnadu: అమెరికా అధ్యక్ష ఎన్నికల (US Presidential Elections 2024) ప్రచారం ఊపందుకుంది. నవంబరులో జరగనున్న ఎన్నికల కోసం అభ్యర్థులు డొనాల్డ్ ట్రంప్, కమలా హారిస్‌లు పోటా పోటీగా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది ఈ ఇరువురి మధ్య మాటల యుద్ధం తారా స్థాయికి చేరుతోంది. అయితే రసవత్తరంగా ప్రచారం సాగుతున్న వేళ రిపబ్లిక్‌ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్ (Donald Trump) ఓ ఇంటర్య్వూలో కీలక వ్యాఖ్యలు చేశారు.

ఓడితే మళ్లీ నిలబడను

నవంబర్‌ 5వ తేదీన జరగబోయే ఎన్నికల్లో తాను ఓడిపోతే మళ్లీ పోటీ చేయబోనని డొనాల్డ్ ట్రంప్ (Trump US Elections) కీలక ప్రకటన చేశారు. ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని ఆయన తేల్చి చెప్పారు. అయితే ఇప్పుడు కచ్చితంగా తాను విజయం సాధిస్తాననే నమ్మకం ఉందని అన్నారు. 78 ఏళ్ల ట్రంప్‌ ఇప్పటికే ఒకసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే.

నా గెలుపు వెనుక ఆ ముగ్గురు

తాము ఈసారి ఓడిపోతామని అస్సలు అనుకోవడం లేదని.. తప్పకుండా విజయం సాధిస్తామని ట్రంప్ ధీమా వ్యక్తం చేశారు. ఒకవేళ ఓడిపోతే మాత్రం 2028 ఎన్నికల్లో బరిలోకి దిగనని స్పష్టం చేశారు. ఇప్పుడు కనుక తాను విజయం సాధిస్తే.. ఆ గెలుపు వెనక ముగ్గురు కీలక వ్యక్తుల పాత్ర ఉంటుందని తెలిపారు. కెన్నడీ జూనియర్.. ఆరోగ్యం, పర్యావరణంపై, దేశంలోని చెత్తను తొలగించడంలో ఎలాన్ మస్క్‌ (Elon M usk), పరిపాలనలో తుల్సి గబ్బార్డ్‌కు చాలా అవగాహన ఉందని వెల్లడించారు.

మరో డిబేట్ కు రెడీ

మరోవైపు డెమోక్రటిక్‌ అభ్యర్థి, అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ (Kamala Harris)తో ఇటీవల జరిగిన డిబేట్‌లో డొనాల్డ్‌ ట్రంప్‌ తడబాటుకు గురయ్యారని అమెరికాలోని ఎన్నికల విశ్లేషకులు అంచనా వేశారు. దీంతో మరోసారి కమలాతో తాను ఓపెన్‌ డిబేట్‌ చేయబోనని ట్రంప్‌ స్పష్టం చేశారు. అయితే అక్టోబర్ 23న సీఎన్‌ఎన్‌ వేదికగా జరగబోయే డిబేట్‌ (Trump Harris Debate)కు తాను సిద్ధమని కమలా హారిస్ తాజాగా ప్రకటించారు. దీనికి ట్రంప్‌ కూడా అంగీకరించాలని ఆమె కోరారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *