డొనాల్డ్ ట్రంప్‌ 2.O.. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఘనవిజయం

Mana Enadu : అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు (US Election Results 2024) వెల్లడయ్యాయి. ఈ ఫలితాల్లో రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) జయకేతనం ఎగురవేశారు. తాజాగా విస్కాన్సిన్‌లో గెలుపుతో మేజిక్‌ ఫిగర్‌ (270)ను దాటి 277 ఎలక్టోరల్‌ ఓట్లతో ఘన విజయం సాధించారు. మరో మూడు రాష్ట్రాల్లో ఆయన ఆధిపత్యం కొనసాగుతోంది. దాదాపు 30కు పైగా ఎలక్టోరల్‌ ఓట్లు దక్కే అవకాశం ఉంది.

స్వింగ్ రాష్ట్రాల్లో ట్రంప్ జోరు

అధికారం చేజిక్కించుకోవడానికి కీలకమైన స్వింగ్‌ రాష్ట్రాల్లోని (US Swing States) జార్జియా, నార్త్‌ కరోలినా, పెన్సిల్వేనియా, విస్కాన్సిన్‌ రాష్ట్రాలను సొంతం చేసుకున్న ట్రంప్.. మరో మూడు స్వింగ్‌ స్టేట్స్‌  నెవడా, మిషిగన్‌, ఆరిజోనాలో ఆధిక్యంలో నిలిచారు. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల (2024 US Election Results) ప్రకారం.. ట్రంప్‌ (Donald Trump) 277 ఎలక్టోరల్‌ ఓట్లతో ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

ట్రంప్‌ గెలిచిన రాష్ట్రాలు..

ఐడహో 4, ఇండియానా 11, కాన్సస్‌ 6, అలబామా 9, ఆర్కాన్సాస్‌ 6, ఫ్లోరిడా (Florida) 30, జార్జియా 16, అయోవా 6, కెంటకీ 8, లూసియానా 8, మైన్‌ 1, నార్త్‌ కరోలినా 16, నార్త్‌ డకోటా 3, నెబ్రాస్కా 4, ఒహాయో 17, ఓక్లహోమా 7, మిస్సోరి 10, మిసిసిపి 6, మోంటానా 4, సౌత్‌ కరోలినా 9, టెన్నెసీ 11, సౌత్‌ డకోటా 3, టెక్సాస్‌ 40, యుటా 6, వెస్ట్‌ వర్జీనియా 4,వయోమింగ్‌ 3, విస్కాన్సిన్‌ 10, పెన్సిల్వేనియా 19.

అమెరికా ఎన్నడూ చూడని విజయమిది

మేజిక్ ఫిగర్ దాటి విజయం సాధించిన సందర్భంగా ట్రంప్ (Trump Speech) తన మద్దతుదారులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ ఎన్నికల్లో రిపబ్లికన్లు నిర్వహించిన ప్రచారం అతిపెద్ద రాజకీయ ఉద్యమం అని ఆయన అన్నారు అమెరికా గతంలో ఎన్నడూ చూడని విజయాన్ని దక్కించుకున్నామని హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా దేశ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. 

ట్రంప్ కు ప్రధాని మోదీ విషెస్

మరోవైపు ట్రంప్‌నకు ప్రధాని మోదీ (PM Modi) శుభాకాంక్షలు తెలియజేశారు. కంగ్రాట్స్ మై ఫ్రెండ్ అంటూ ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. ‘‘చరిత్రాత్మక ఎన్నికల విజయం సాధించిన డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump Victory)నకు హృదయపూర్వక శుభాకాంక్షలు.’’ అని ఆ పోస్టులో రాసుకొచ్చారు. అలాగే గతంలో పలు వేదికల్లో ఇద్దరు కలిసి దిగిన చిత్రాలను షేర్ చేశారు. 

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *