
ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లో పాలిటిక్స్(Politics) ఒక్కసారిగా హీటెక్కాయి. YCP సీనియర్ నేత, రాజ్యసభ MP విజయసాయి రెడ్డి(VIjaya Sai Reddy) రాజకీయాలకు గుడ్ బై చెప్పడం హాట్ టాపిక్‌గా మారింది. సడెన్‌గా ఆయన తీసుకున్న నిర్ణయం వెనుక అసలు కారణమేంటి? అసలు ఎందుకు విజయసాయి రాజకీయాల నుంచి తప్పుకున్నారు? ఈ విషయం ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్(YS Jagan)కి ముందే తెలుసా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. మరోవైపు ఆ పార్టీ మరో సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి(Alla Ayodhya Ramireddy) కూడా విజయసాయి రెడ్డి బాటలోనే నడవనున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఆయన విదేశాల్లో ఉండటంతో ఈ విషయంపై కాస్త క్లారిటీ రావాల్సి ఉంది.
త్వరలో మరికొందరు నాయకుల రాజీనామా?
ఇదిలా ఉండగా త్వరలో మరికొందరు YCP కీలక నాయకులు ఆ పార్టీని వీడనున్నారని, రాజకీయాల నుంచి తప్పుకుంటారనే ప్రచారం తెరపైకి వచ్చింది. ముఖ్యంగా అధికారంలో ఉన్నప్పుడు ఫైర్ బ్రాండ్ లీడర్‌గా గుర్తింపు పొందిన మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని(Kodali Nani) గురించీ ఇలాంటి ప్రచారమే జరుగుతోంది. ఈ నెల 25న కొడాలి నాని YCPకి రాజీనామా చేస్తారని.. ఆరోగ్య కారణాల దృష్ట్యా రాజకీయాలకు దూరంగా ఉండాలని అనుకుంటున్నారని ఓ పోస్ట్(Post) సోషల్ మీడియా(Social Media)లో తెగ ట్రెండ్ అవుతోంది. దీంతో వైసీపీ శ్రేణుల్లో ఒక్కసారిగా ఆందోళన మొదలైంది.
అది ఫేక్.. ఎవరూ నమ్మొద్దు: కొడాలి నాని
ఈ నేపథ్యంలో స్వయంగా కొడాలి నాని స్పందించారు. అది ఫేక్ న్యూస్(Fake News) అని ఆయన క్లారిటీ ఇచ్చారు. తన గురించి జరుగుతున్న ప్రచారంలో నిజం లేదన్నారు. తాను YCPకి రాజీనామా చేస్తున్నట్లు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదన్నారు. ఆరోగ్య కారణాలతో రాజకీయాలకు దూరంగా ఉండాలని అనుకుంటున్న ప్రచారంలోనూ వాస్తవం లేదన్నారు. అది ఫేక్ పోస్ట్ అని ఆయన తేల్చి చెప్పారు. అది ఎడిటెడ్ న్యూస్(Edit News) అని, ఫేక్ అని, దాన్ని ఎవరూ నమ్మొద్దని నాని సోషల్ మీడియా వేదికగా స్పందించారు.
Alert 🚨
Don’t believe Fake (Edited) News #KodaliNani #TeamKodaliNani pic.twitter.com/Pt1DQedck1
— Kodali Nani (@IamKodaliNani) January 24, 2025