
ఇండియన్ ఆస్ట్రోనాట్, IAF గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా(Shubhansu Shukla) అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) నుంచి నేడు భూమి మీదకు రానున్నారు. సోమవారం శుక్లతోపాటు యాక్సియం-4 మిషన్‌లో భాగంగా ఉన్న మరో ముగ్గురు వ్యోమగాములు ఐఎస్‌ఎస్‌కు వీడ్కోలు పలికి డ్రాగన్ గ్రేస్ వ్యోమనౌక(Dragon Grace spacecraft)లో తిరుగు ప్రయాణమయ్యారు. 22.30 గంటల ప్రయాణం తర్వాత భారత కాలమానం ప్రకారం మంగళవారం మధ్యాహ్నం 3.01 గంటలకు USలోని కాలిఫోర్నియా తీరానికి చేరువలో ఫసిఫిక్ జలాలపై ఈ వ్యోమనౌక దిగుతుంది.
Indian astronaut Shubhanshu Shukla undocked from the International Space Station (ISS) on July 14, marking the end of his mission aboard the orbiting laboratory.
The highly anticipated departure follows a series of meticulously planned steps to ensure a safe and smooth return to… pic.twitter.com/GHSZ6CVJ7g
— IndiaToday (@IndiaToday) July 15, 2025
కాగా యాక్సియం 4 మిషన్(Axium-4 mission)లో భాగంగా జూన్ 25న ఫ్లోరిడాలోని కెన్నడీ స్పేస్ సెంటర్(Kennedy Space Center) నుంచి SpaceX Falcon-9 రాకెట్ ద్వారా డ్రాగన్ అంతరిక్ష నౌక(Dragon spacecraft)లో ISSకు చేరుకున్న శుక్లా.. దాదాపు 18 రోజుల పాటు ఎస్ఎస్‌లో పలు పరిశోధనలు చేశారు.
ఫసిఫిక్ సాగర జలాలపై దిగుతుంది..
తిరుగుప్రయాణంలో భాగంగా పలు విన్యాసాలను చేపడతారు. భూ వాతావరణం(Earth’s atmosphere)లోకి ప్రవేశానికి వీలుగా స్పేస్‌క్రాఫ్ట్ దిశను మార్చడం వంటివి చేస్తారు. తద్వారా భూ వాతావరణంలోకి ప్రవేశించేటప్పటికి దాని ఉష్ణకవచం.. గాలి రాపిడిని ఎదుర్కొంటుంది. ఆ సమయంలో ఉత్పన్నమయ్యే 1,600 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతల నుంచి వ్యోమనౌకను రక్షించడానికి ఇది వీలు కల్పిస్తుంది. నేల నుంచి 5.7 కిలోమీటర్ల ఎత్తులో స్థిరీకరణ పారాచూట్లు విచ్చుకుంటాయి. 2 కిలోమీటర్ల ఎత్తులో ప్రధాన పారాచూట్లు(Parachutes) విచ్చుకొని వ్యోమనౌక వేగాన్ని తగ్గిస్తాయి. ఆ తర్వాత అది ఫసిఫిక్ సాగర జలాలపై దిగుతుంది. సహాయ సిబ్బంది రంగంలోకి దిగి వ్యోమనౌకను ఒక నౌకపైకి చేరుస్తారు.