Dulquer Salmaan: టీజర్‌తోనే హైప్ క్రియేట్ చేసిన ‘కాంత’ టీజర్ వైరల్.. దుల్కర్ సల్మాన్ మరో విభిన్న ప్రయోగం..

మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్(Dulquer Salmaan) తాజాగా మరో విభిన్నమైన కథా నేపథ్యంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. వరుస విజయాలతో దూసుకుపోతున్న ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం కాంత (Kaantha). ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు మేకర్స్. ఈ టీజర్‌కు సెన్సార్ బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. టీజర్ రిలీజ్(Kaantha Teaser) అయిన వెంటనే ప్రేక్షకుల్లో ఆసక్తిని రేపుతోంది.

ఈ చిత్రం ప్రత్యేకత ఏమిటంటే, ఇది ఒక సాధారణ బయోపిక్ కాదు… ఒక దృశ్య కావ్యం లాంటిదని చెప్పవచ్చు. 1950ల మద్రాసు నగరంలోని సినీ ప్రపంచాన్ని, ఆ కాలంలో సినిమా రంగం ఎలా ఉండేది, గ్లామర్, సంగీతం, నటనా విలాసాలు ఎలా ఉండేవి అన్నదాన్ని అద్భుతంగా ఆవిష్కరించింది.

ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన సెల్వమణి సెల్వరాజ్ గతంలో నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ ది హంట్ ఫర్ వీరప్పన్ (The Hunt for Veerappan) ద్వారా గుర్తింపు పొందారు. ఇప్పుడు కాంతతో ఆయన దర్శకుడిగా ఫీచర్ ఫిల్మ్ రంగంలోకి అడుగుపెడుతున్నారు. టీజర్ చూస్తే ఆయన దృష్టిలో ప్రతి ఫ్రేమ్‌కి ఒక ఉద్దేశం ఉందని స్పష్టమవుతుంది.

రానా దగ్గుబాటి(Rana Daggupati) స్పిరిట్ మీడియా, దుల్కర్ సల్మాన్ వేఫరర్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే(Bagyashri Borse), సముద్రఖని(Samuthirakani) కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటివరకు రిలీజ్ డేట్ ప్రకటించకపోయినా, టీజర్‌కి వస్తున్న స్పందన చూస్తే కాంత సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. లక్కీ భాస్కర్ విజయానంతరం దుల్కర్‌కు ఇది మరో కెరీర్ టర్నింగ్ పాయింట్ అవుతుందన్నది అభిమానుల నమ్మకం.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *