Mana Enadu: నటసింహం నదమూరి బాలకృష్ణ(Nadamuri Balakrishna) హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే సీజన్-4(Unstoppable with NBK Season-4) అట్టహాసంగా (OCT 25న) ప్రారంభమైంది. ఫస్ట్ ఎపిసోడ్‌కు ఏపీ సీఎం చంద్రబాబు(AP CM Chandrababu) గెస్ట్‌గా హాజరైన సంగతి తెలిసిదే. ప్రస్తుతం తెలుగు OTT ప్లాట్ ఫామ్ Ahaలో ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ అవుతోంది. ఇది రికార్డ్ వ్యూస్‌తో దూసుకుపోతోంది. ఇక ‘ఆహా’ (Aha) ఓటీటీ ప్లాట్ ఫామ్ ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న అన్ స్టాపబుల్ (Unstoppable) షో నాలుగో సీజన్‌లో రెండో ఎపిసోడ్(Second episode)పై అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
అయితే ఈ షోకు తర్వాత వచ్చే గెస్ట్‌పై ఓ న్యూస్ తెగ చక్కర్లు కొడుతోంది. రెండో ఎపిసోడ్‌కు మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్(Dulquer Salmaan) అతిథిగా వచ్చినట్లు తెలుస్తోంది. ఆయన నటించిన మూవీ ‘‘లక్కీ భాస్కర్(Lucky Bhaskar)’’. మీనాక్షి చౌదరి(Meenakshi Chaudhary) కథానాయికగా నటించిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్(Sitara Entertainments), ఫార్చూన్‌ఫోర్ సినిమాస్ బ్యానర్స్ నిర్మించాయి. వెంకీ అట్లూరి(Venky Atluri) దర్శకత్వంలో ఈ సినిమా రూపుదిద్దుకుంది. దీపావళి(Diwali) కానుకగా OCT 31న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ నేపథ్యంలోనే ‘‘లక్కీ భాస్కర్’’ మూవీ ప్రమోషన్లలో భాగంగా అన్‌స్టాపబుల్ సీజన్ 4లో దుల్కర్ సల్మాన్‌తో పాటు లక్కీభాస్కర్ టీమ్ హాజరైందట. ఇప్పటికే ఇందుకు సంబంధించిన షూటింగ్ పూరైనట్లు సమాచారం. ఇక బాలయ్య తనదైన శైలిలో పలు ప్రశ్నలు అడిగారట.
దుల్కర్ ఎలాంటి సమాధానాలు చెప్పాడు. బాలయ్య(Balayya) ఏ ఏ ప్రశ్నలు అడిగారో తెలుసుకునేందుకు రెండో ఎపిసోడ్ కోసం చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు. అయితే దీనిపై క్లారిటీ రానుంది.






