ANR National Award 2024: ఏఎన్‌ఆర్ అవార్డు అందుకున్న చిరు.. మెగాస్టార్ ఎమోషనల్‌

Mana Enadu: చిరంజీవి(Chiranjeevi) కేవలం సినీ పరిశ్రమలోనే కాదు.. ఎన్నో సేవా కార్యక్రమాలు(Service programs) కొనసాగిస్తూ ఎంతో ప్రజాభిమానాన్ని చూరగొన్నారు. ఎవరు ఆపదలో ఉన్నా సరే నేనున్నాంటూ ముందుకొస్తుంటారు మెగాస్టార్(Megastar). ఈనేపథ్యంలో ఆయన ఖాతాలో మరో కలికితురాయి చేరింది. ప్రతిష్ఠాత్మక అక్కినేని నాగేశ్వరరావు జాతీయ అవార్డు(Akkinenni Nageshwararao Nationa Award)ను ఆయన బిగ్ బీ అమితాబ్ బచ్చన్(Amitabh Bachchan) చేతుల మీదుగా అందుకున్నారు. అన్నపూర్ణ స్టూడియో(Annapurna Studio)లో జరిగిన ఈ కార్యక్రమానికి చిరు తల్లి అంజనాదేవి కూడా హాజరయ్యారు. ఏటా నటులకు ఈ పురస్కారం అందజేస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ అవార్డును తొలిసారిగా 2006లో బాలీవుడ్ నటుడు దేవానంద్‌ (Devanand)కు అందజేశారు. బిగ్ బీ అమితాబ్ 2014లో ఈ పురస్కారాన్ని అందుకున్నారు.

 హాజరైన సినీ ప్రముఖులు

తెలుగులో తొలి తరం అగ్ర హీరోలలో ఒకరైన అక్కినేని నాగేశ్వరరావు పేరిట ఇచ్చే పురస్కారం మెగాస్టార్‌ని వరించింది. అక్కినేని నాగేశ్వర రావు (Akkineni Nageswara Rao) పేరిట ఏటా ఆయన కుటుంబం అవార్డు ఇవ్వడం ఆనవాయితీ. ఈ మధ్య రెండేళ్లకు ఒకసారి ఆ అవార్డు ఇస్తున్నారు. అక్కినేని శత జయంతి(centenary) సందర్భంగా ఈసారి మెగాస్టార్‌ని ఈ అవార్డు వరించింది. ఈ వేడుకకు అక్కినేని జాతీయ పురస్కార వేడుకలకు దర్శకులు రాఘవేందర్ రావు, నిర్మాత అశ్వినీదత్, నిర్మాత అల్లు అరవింద్, హీరోలు వెంకటేశ్, రామ్ చరణ్, సీనియర్ నటుడు ప్రకాశ్ రాజ్​తో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. చిరంజీవి తల్లి అంజనాదేవి కూడా ఈ వేడుకలకు హాజరయ్యారు.

 మీ ప్రేమ, అభిమానానికి ధన్యవాదాలు: చిరు

ANR జాతీయ పురస్కార వేడుకల్లో మెగాస్టార్ చిరంజీవి ఎమోషనల్ అయ్యారు. నాగేశ్వరరావు మరణానికి ముందు మాట్లాడిన చివరి ఆడియోను కార్యక్రమంలో వినిపించారు. ‘నా కోసం మీరంతా దేవుడిని ప్రార్థిస్తున్నారని తెలుసు. మీ ప్రేమ, అభిమానానికి ధన్యవాదాలు. త్వరలోనే మీ ముందుకు వస్తాననే నమ్మకం ఉంది. మీ ప్రేమకు రుణపడి ఉంటా. ఇక సెలవు’ అని ఐసీయూలో మాట్లాడారు. ఇది విని మెగాస్టార్, రమ్యకృష్ణ, నాని కళ్లలో నీళ్లు తిరిగాయి. అంతకుముందు అవార్డు అందుకునే ముందు చిరంజీవి అమితాబ్ పాదాలకు నమస్కరించారు. ఈ సీన్ అందరినీ ఆకట్టుకుంది. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే చిరులాంటి వాళ్లు చాలా అరుదుగా ఉంటారని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *