Sai Pallavi: ట్విటర్‌లో టెండ్రింగ్‌లో ‘బాయ్‌కాట్ సాయిపల్లవి’.. ఎందుకంటే?

Mana Enadu: తమిళకుట్టీ, స్టార్ హీరోయిన్ సాయిపల్లవి(Sai Pallavi)పై సోషల్ మీడియా(Social Media)లో వివాదం రేగుతోంది. ‘బాయ్‌కాట్ సాయిపల్లవి (#BoycottSaiPallavi)’ అనే హ్యాష్‌టాగ్‌ ట్రెండ్ అవుతోంది. ఇందుకు రీజన్‌ ఏంటో కూడా నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ‘ఇండియన్ ఆర్మీ(Indian Army)పై సాయి పల్లవి చేసిన వ్యాఖ్యలపై ఆమె తప్పకుండా క్షమాపణలు(Apologies) చెప్పి తీరాల్సిందే’ అని నెటిజన్లు ట్విటర్ (X)లో డిమాండ్ చేస్తున్నారు. అయితే ‘సాయి పల్లవి ఏం చెప్పిందో చాలా మందికి అర్థం అయిందని నేను అనుకోను’ అని గాయని చిన్మయి శ్రీపాద ‘ఎక్స్’ వేదికగా తెలిపారు.

 ఈనెల 31న ‘అమరన్’

కాగా శివ కార్తీకేయన్-సాయి పల్లవి(Shiva Karthikeyan-Sai Pallavi) జంటగా నటించిన చిత్రం ‘అమరన్(Amaran)’. తెలుగు, తమిళ భాషల్లో ఈ నెల 31న విడుదలవుతోంది. మేజర్ ముకుంద్ వరదరాజన్(Major Mukund Varadarajan) జీవితం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. అయితే, ఈ మూవీ విడుదల సందర్భంగా సాయి పల్లవిపై ట్రోలింగ్(Trolling on Sai Pallavi) జరుగుతోంది. గతంలో ఓ ఇంటర్వ్యూలో సాయి పల్లవి ఇండియన్ ఆర్మీ గురించి మాట్లాడిన వీడియోను ఇప్పుడు షేర్ చేస్తూ ఆమెపై విమర్శల వర్షం గుప్పిస్తున్నారు.

 అసలేంటి వివాదం?

గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో “పాకిస్థానీ(For Pakistanis)లకు ఇండియన్ ఆర్మీ టెర్రరిస్టుల్లా(Like Indian Army terrorists)గా, భారతీయులకు పాక్ సైన్యం టెర్రరిస్టుల్లా(For Indians, Pakistan Army is like terrorists)గా కనిపిస్తుంది” అని సాయి పల్లవి అన్నారు. ఈ మాటలకు సంబంధించిన చిన్న క్లిప్ వైరల్‌(Viral)గా మారింది. ‘సాయి పల్లవి మాటలు చూస్తుంటే ఆమె జాకీర్ నాయక్ మాటలకు ప్రభావితమైనట్లుగా అర్థమవుతోంది. ఆమె నటించిన సినిమాలు చూడొద్దు’ అంటూ కొందరు ఎక్స్(X)లో ఫైరవుతున్నారు.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *