
తెలంగాణ(Telangana), ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాష్ట్రాల విద్యార్థులకు ఈ ఏడాది దసరా సెలవులు(Dussehra holidays) కాస్త ముందుగానే రానున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోని విద్యా సంస్థలకు 2025 విద్యా సంవత్సరం కోసం ప్రభుత్వాలు దసరా సెలవులను ప్రకటించాయి. ఈ సెలవులు విద్యార్థులకు పండుగ వేడుకలను కుటుంబంతో ఆనందించే అవకాశం కల్పిస్తాయి. ఆంధ్రప్రదేశ్‌లో దసరా సెలవులు సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2 వరకు, అంటే మొత్తం 9 రోజులు ఉంటాయి. అయితే, క్రైస్తవ మైనారిటీ విద్యా సంస్థల(Christian minority educational institutions)కు సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 2 వరకు, అనగా 6 రోజుల సెలవులు ఉంటాయి.
తెలంగాణలో సెప్టెంబర్ 21 నుంచి అక్టోబర్ 3 వరకు
ఇక తెలంగాణలో సెప్టెంబర్ 21 నుంచి అక్టోబర్ 3 వరకు అంటే మొత్తం 13 రోజులు. ఈ సెలవులు బతుకమ్మ వేడుకల(Bathukamma celebrations)తో మొదలై, దసరా విజయదశమి(Vijayadashami)తో ముగుస్తాయి. ఈ సెలవుల సమయంలో విద్యార్థులు తమ బంధువులను కలవడం, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనడం వంటి వాటికి సమయం కేటాయించవచ్చు. తెలంగాణలో సెప్టెంబర్ 5న మిలాద్ ఉన్ నబీ సందర్భంగా కూడా సెలవు ఉంది, దీనివల్ల విద్యార్థులకు అదనపు హాలిడే లభిస్తుంది. ఈ సెలవులు విద్యా సంస్థలకు మాత్రమే వర్తిస్తాయి, అయితే అక్టోబర్ 2న గాంధీ జయంతి/దసరా సందర్భంగా ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులకు కూడా సెలవు ఉంటుంది. మొత్తంగా ఈ అకాడమిక్ క్యాలెండర్‌లో 233 వర్కింగ్ డేస్ ఉండగా.. 83 రోజులు సెలవులు వచ్చాయి.