Hyderabad Begging Mafia : సాయం పేరిట సంపాదన.. NGO పేరిట భిక్షాటన.. బెగ్గింగ్ మాఫియా గుట్టురట్టు
Hyderabad Begging Mafia : ప్రార్థించే పెదవులకన్నా.. సాయంచేసే చేతులు మిన్న. పుట్టినరోజు, పెళ్లిరోజు అనాథలకి సాయం చేయండి. ఒకరోజు అన్నంపెట్టి కడుపు నింపండి వంటి సందేశాలతో ఉన్న స్టీల్‌బాక్సులతో హైదరాబాద్‌లోని ప్రధాన కూడళ్ల వద్ద సాయంచేయమంటూ కొందరు అడగటం చూస్తుంటాం. కానీ ఆ దందావెనుక ఉన్న కేటుగాళ్లు ఎంత సంపాదిస్తున్నారో తెలిస్తే నిజంగా షాక్ అవ్వాల్సిందే. భిక్షాటన ద్వారా వచ్చిన డబ్బుతో ఆ నేరగాళ్లు నగర శివారు ప్రాంతాల్లో రూ.90లక్షలు విలువైన భూములు కొనుగోలు చేశారు.