
అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న IPL-2025 అఫీషియల్ షెడ్యూల్ వచ్చేసింది. మార్చి 22 నుంచి ఈ మెగా టీ20 లీగ్ ప్రారంభం కానుంది. దీంతో ఏ జట్టు ఏ టీమ్‌తో ఎప్పుడు, ఏ వేదికగా తలపడనుందో ఫ్యాన్స్‌కు తెలిసిపోయింది. దీంతో ఇక ఆయా మ్యాచులను ప్రత్యక్షం(Live)గా చూసేందుకు రెడీ అవుతున్నారు. ఇందుకు సంబంధించి టికెట్లను ఎలా బుక్(Tickets Booking) చేసుకోవాలి.. టికెట్ రేట్లు ఎలా ఉంటాయని గూగుల్లో తెగ వెతికేస్తున్నారు. కాగా ఈ సీజన్‌లో హైదరాబాద్(HYD)లోని ఉప్పల్ స్టేడియంలో 7 లీగ్ మ్యాచులతో పాటు, క్వాలిఫయర్ -1, ఎలిమినేటర్ మ్యాచ్ జరుగుతుంది. మరి ఈ మ్యాచులకు టికెట్లు ఎలా బుక్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందామా..
ఇలా బుక్ చేసుకోండి..
✹ IPL మ్యాచ్‌ల కోసం Online అమ్మకాలను సాధారణంగా నిర్వహిస్తున్న Bookmyshow or Paytm insider, iplt20.com వంటి విశ్వసనీయ ప్లాట్‌ఫారమ్‌లకు వెళ్లండి. టికెట్ అమ్మకాలకు ప్రత్యక్ష లింక్‌ల కోసం మీరు అధికారిక SRH వెబ్‌సైట్‌ను కూడా తనిఖీ చేయవచ్చు.
✹ మీరు ఎంపిక చేసుకున్న ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులో ఉన్న మ్యాచ్ లిస్ట్ నుంచి మీకు కావాల్సిన SRH మ్యాచ్‌ను ఎంచుకోండి. ఒకవేళ CSK vs MI మధ్య మ్యాచ్ అయితే టికెట్ల వేగంగా అమ్ముడయ్యే అవకాశం ఉంది. ఆ మ్యాచ్ టికెట్ల కోసం సాధ్యమైనంత త్వరగా మీరు బుక్ చేసుకుంటే మంచిది.
✹ మీరు వెళ్లాల్సిన మ్యాచ్ను ఎంచుకున్న తర్వాత, అందుబాటులో ఉన్న సీటింగ్ విభాగాలను తనిఖీ చేయండి. మీ ఎంపికలో స్టేడియం ఎగువ శ్రేణి, ప్రీమియం సీట్లు, VIP బాక్స్‌లు ఉంటాయి. మీరు ఎంపిక చేసుకునే సీట్ల ఆధారంగా టికెట్ ధరలు మారుతూ ఉంటాయి.
✹ సీట్లను ఎంచుకున్న తర్వాత, మీ కార్టులో చేర్చి చెక్ అవుట్ కు వెళ్లండి. క్రెడిట్/డెబిట్ కార్డులు, UPI లేదా పేటీఎం వంటి మొబైల్ వాలెట్ల ద్వారా చెల్లింపు చేయవచ్చు.
✹ విజయవంతమైన చెల్లింపు తర్వాత, మీరు మీ E-mail లేదా టికెటింగ్ యాప్ ద్వారా E-Ticket అందుకుంటారు. మ్యాచ్ రోజున స్టేడియంలోకి వెళ్లడానికి మీకు సంబంధించిన ఐడీ ప్రూప్స్‌తోపాటు దీన్ని తీసుకెళ్లాలి.
✹ ఆయా రాష్ట్రాల క్రికెట్ బోర్డులు సూచించిన ప్లేసుల్లో ఆఫ్‌లైన్‌లోనూ బుక్ చేసుకోవచ్చు.
SRH ఐపీఎల్-2025 షెడ్యూల్
☛ 23 మార్చి- SRH vs RR (వేదిక: HYD, మ.3.30)
☛ 27 మార్చి- LSG vs SRH (వేదిక: HYD, రాత్రి 7.30)
☛ 30 మార్చి- DC vs SRH (వేదిక: విశాఖపట్నం, మ.3.30)
☛ 3 ఏప్రిల్- SRH vs KKR (వేదిక: కోల్‌కతా, రాత్రి 7.30)
☛ 6 ఏప్రిల్- GT vs SRH (వేదిక: HYD, రాత్రి 7.30)
☛ 12 ఏప్రిల్- SRH vs PK (వేదిక: HYD, రాత్రి 7.30)
☛ 17 ఏప్రిల్- MI vs SRH (వేదిక: ముంబై, రాత్రి 7.30)
☛ 23 ఏప్రిల్- MI vs SRH (వేదిక: HYD, రాత్రి 7.30)
☛ 25 ఏప్రిల్- SRH vs CSk (వేదిక: చెన్నై, రాత్రి 7.30)
☛ 2 మే- GT vs SRH (వేదిక: అహ్మదాబాద్, రాత్రి 7.30)
☛ 5 మే- SRH vs DC (వేదిక: HYD, రాత్రి 7.30)
☛ 10 మే- KKR vs SHR (వేదిక: HYD, రాత్రి 7.30)
☛ 13 మే- RCH vs SRH (వేదిక: బెంగళూరు, రాత్రి 7.30)
☛ 18 మే- SRH vs LSG (వేదిక: లక్నో, రాత్రి 7.30)