ప్రస్తుతం తెలుగురాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ(Bird Flu) ఎఫెక్ట్ కొనసాగుతోంది. ముఖ్యంగా ఈ వైరస్ ప్రభావం ఏపీ(Andhra Pradesh)లో ఎక్కువగా ప్రభావం చూపుతోంది. వేల సంఖ్యలో కోళ్లు మృత్యువాత(Chickens die) పడుతున్నాయి. దీంతో చికెన్ షాపులూ మూతపడుతున్నాయి. అటు కోడిగుడ్లను కూడా ప్రజలు తినడానికి భయపడుతున్నారు. దీంతో చికెన్(Chicken), గుడ్ల(Eggs) అమ్మకాలు అమాంతం పడిపోయాయి. అయితే ఈ బర్డ్ ఫ్లూ కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. ఇప్పుడు అగ్రరాజ్యం అమెరికా(America)కు కూడా పాకింది. అయితే అది తినడం వల్లే భయం కాదు.. తినడం కోసం పెరిగిన భయం.. ఇంతకీ బర్డ్ ఫ్లూకి, అమెరికాకి సంబంధం ఏంటని అనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ చదవాల్సిందే.
గుడ్లకు అమెరికాలో డిమాండ్
బర్డ్ ప్లూ వల్ల కోళ్లు, గుడ్ల ఉత్పత్తి దారుణంగా పడిపోయింది. దీంతో అమెరికా(USA)లో కోడిగుడ్ల ధరలు రోజురోజుకూ కొండెక్కుతున్నాయి. అమెరికాకు గుడ్లను ఎక్కువగా AP నుంచి ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల నుంచి ఎగుమతి చేస్తుంటారు. ముఖ్యంగా యూఎస్‌లో గుడ్లను ప్రోటీన్లు(Protiens) అందించే ఆహారంగా అక్కడి ప్రజలు భావిస్తారు. దీంతో అక్కడ గుడ్లకు భారీగా డిమాండ్ ఉంటుంది. ఇక, బర్డ్‌ఫ్లూ దెబ్బకి గుడ్లు ట్టే కోళ్లు క్రమంగా చనిపోతుండడంతో వాటి సంఖ్య గణనీయంగా తగ్గింది.
యూఎస్‌లో గుడ్డుప్రియుల ఆందోళన
ఈ కారణంతో గుడ్ల ఉత్పత్తి ఒక్కసారిగా పడిపోవడంతో.. దాని ప్రభావం కోడి గుడ్ల ధరలపై పడింది. దీంతో అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో డజను గుడ్ల ధర ఏకంగా 10 డాలర్లు (రూ.867)కు చేరిందంటే ప్రస్తుతం అక్కడి పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే, గత ఏడాది జనవరి నుంచి USలో కోడి గుడ్ల ధరలు పెరుగుతున్నాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు డజను గుడ్ల ధర ఏకంగా 65% మేర పెరిగిందట. దీంతో గుడ్డు ప్రియులు ఆందోళన చెందుతున్నారని అక్కడి వార్తా పత్రికలు పేర్కొన్నాయి.






