
బాలీవుడ్(Bollywood)లో చాలా మంది స్టార్లుగా ఎదిగారు. కానీ, కొంత మంది మాత్రమే ఆ స్టార్‌డమ్(Stardom)ను కెరీర్ చివరి వరకూ కొనసాగించారు. కొందరు మధ్యలో ట్రాక్ తప్పినా మళ్లీ గెలిచి చూపించారు. కొందరు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా గెలిచి నిలిచారు. అలాంటి వాళ్లలో ఒకడు సన్నీ డియోల్ (Sunny Deol). యాక్షన్ పర్ఫార్మెన్స్(Action Performance)కు అతడు కేరాఫ్ అడ్రస్. సన్నీ 1980, 90ల్లో ఇండస్ట్రీని ఓ ఊపు ఊపాడు. కానీ, తర్వాత వరుస ఫ్లాప్స్‌తో సతమతమయ్యాడు. సరిగ్గా అదే సమయంలో ఓ హిట్ మూవీ, అతణ్ని మళ్లీ బాక్సాఫీస్(Boxoffice) కింగ్‌గా నిలబెట్టింది. ఇంతకీ ఆ మూవీ ఏంటంటే..
మొదటి సినిమాతోనే ఇండస్ట్రీ హిట్
లెజెండరీ ఫిల్మ్ ఫ్యామిలీ నుంచి వచ్చిన సన్నీ డియోల్ (Sunny Deol), 1983లో బేతాబ్ సినిమాతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చాడు. మొదటి అడుగులోనే సక్సెస్ సాధించాడు. ఈ క్రమంలోనే యాక్షన్ హీరో(Action Hero)గా అతని పేరు ఇండస్ట్రీలో మారుమోగింది. ఇలా నర్షింహ్మ, ఘాతక్, బోర్డర్, జీత్ సినిమాలతో యాక్షన్ జోనర్ అంటే తనపేరే గుర్తుకొచ్చేలా చేశాడు. భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. కానీ 2001లో సన్నీ నటించిన ‘గదర్: ఏక్ ప్రేమ్ కథ(Gadar: Ek Prem Katha)’ సినిమా తర్వాత కొన్ని దశాబ్దాల వరకు అతడు మరో హిట్ అందుకోలేదు.
మళ్లీ సన్నీ గోల్డెన్ ఎరా షురూ
‘గదర్(Gadar)’ తర్వాత సన్నీ కెరీర్‌లో టఫ్ టైమ్ నడిచింది. ఈ మూవీ తర్వాత 22 ఏళ్లలో 30 సినిమాల్లో నటిస్తే, అన్నీ నిరాశపర్చాయి. ఆ తర్వాత ఎన్ని ప్రయోగాలు చేసినా సక్సెస్ కాలేకపోయాడు. దీంతో 2001లో వచ్చిన గదర్‌కు 2023లో గదర్-2(Gadar-2) పేరుతో సీక్వెల్ వచ్చింది. దీన్ని అనిల్ శర్మ(Anil Sharma)నే డైరెక్ట్ చేశాడు. ఆల్‌టైమ్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా రూ.686 కోట్లతో సన్నీ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు కొల్లగొట్టింది. దీంతో మళ్లీ తన గోల్డెన్ ఎరా(Golden Era) ప్రారంభమైందని సన్నీ నిరూపించాడు. కాగా సినిమాలు, బ్రాండ్ ఎండోర్స్‌మెంట్లు ఇతర అసెట్స్ ద్వారా సన్నీ డియోల్ (Sunny Deol) నికర సంపద రూ.120 కోట్లని అంచనా.