Vice President Poll: సెప్టెంబర్ 9న భారత ఉప రాష్ట్రపతి ఎన్నిక

New Delhi: భారత ఉపరాష్ట్రపతి(Vice President of India) ఎన్నిక సెప్టెంబర్ 9న జరగనుందని ఎన్నికల సంఘం (Election Commission) ఇవాళ (ఆగస్టు 1న) ప్రకటించింది. జగదీప్ ధన్‌ఖడ్(Jagdeep Dhankhar) జులై 21న ఆరోగ్య కారణాలతో రాజీనామా(Resign) చేయడంతో ఈ పదవి ఖాళీ అయింది. ఈ ఎన్నికల షెడ్యూల్ ప్రకారం, ఆగస్టు 7 నుంచి 21 వరకు నామినేషన్లు(Nominations) దాఖలు చేయవచ్చు. ఆగస్టు 22న నామినేషన్ల పరిశీలన, 25 వరకు ఉపసంహరణ గడువు ఉంది. ఇక సెప్టెంబర్ 9న పోలింగ్(Polling) ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగి, అదే రోజు ఫలితాలు(Results) వెల్లడవుతాయి.

రేసులో ఉన్నది వీరేనా?

కాగా భారత ఉప రాష్ట్రపతిని లోక్‌సభ(Lok shabha), రాజ్యసభ(Rajya sabha) సభ్యులతో కూడిన ఎలక్టోరల్ కాలేజ్ ఎన్నుకుంటుంది. ఈ ప్రక్రియలో సింగిల్ ట్రాన్స్‌ఫరబుల్ ఓటు ద్వారా రహస్య బ్యాలెట్ ఉపయోగిస్తారు. రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ సింగ్, బిహార్ సీఎం నీతీశ్ కుమార్, జమ్మూకశ్మీర్, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్లు ఉపరాష్ట్రపతి రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. కాగా పార్లమెంటలో ఎన్డీఏ మెజారిటీతో ఉండగా, ఈ ఎన్నిక రాజకీయంగా కీలకంగా మారనుంది. ఈసీ రిటర్నింగ్ అధికారిగా రాజ్యసభ సెక్రటరీ జనరల్ పీసీ మోదీని నియమించింది.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *