Education: ఒత్తిడిని ఎదుర్కోవాలని విద్యార్థులకు చెప్పండి!

మారుతున్న కాలానికి అనుగుణంగా తమ ప్రభుత్వం విద్యావ్యవస్థలో మార్పులను తీసుకువస్తోందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి తాజాగా వెల్లడించారు.

మారుతున్న కాలానికి అనుగుణంగా తమ ప్రభుత్వం విద్యావ్యవస్థలో మార్పులను తీసుకువస్తోందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి తాజాగా వెల్లడించారు. ప్రస్తుతం ప్రపంచంలో రకరకాల రూపాల్లో ఒత్తిళ్లు ఎదురవుతున్నాయని, వాటిని తట్టుకునేందుకు చిన్నప్పటి నుంచే విద్యార్థులను తీర్చిదిద్దేలా ‘చెలిమి’ కార్యక్రమాన్ని, వారిలో వ్యాపార దృక్ఫథాన్ని పెంచడంతో పాటు వ్యవస్థాపక ఆలోచనలను పెంపొందించేలా ‘అంకురం’ కార్యక్రమాన్ని ప్రయోగాత్మకంగా ప్రవేశపెడుతున్నట్లు ఆమె ప్రకటించారు. బుధవారం రంగారెడ్డి జిల్లా శివరాంపల్లి ఉన్నత పాఠశాలలో చెలిమి, అంకురం కార్యక్రమాలను మంత్రి లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌ కుమార్‌, ఎమ్మెల్యే ప్రకాశ్‌ గౌడ్‌, విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, పాఠశాల విద్య డైరెక్టర్‌ దేవసేన, రంగారెడ్డి జిల్లా పరిషత్‌ చైర్మన్‌ టి. అనిత హరినాథ్‌రెడ్డి, విద్య-మౌలిక సదుపాయాల కల్పన శాఖ చైర్మన్‌ ఆర్‌. శ్రీధర్‌ రెడ్డి తదితరులు బ్రోచర్‌లు, కరపత్రాలను ఆవిష్కరించారు. అనంతరం విద్యారంగంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళికల గురించి మంత్రి వివరించారు.

‘‘పరిస్థితులకు అనుగుణంగా శాస్త్రీయంగా చదువులను అభ్యసిస్తేనే జాతి నిర్మాణంలో విద్యార్థులు నిర్మాణాత్మకమైన పాత్రను పోషించగలరని ప్రభుత్వం భావిస్తోంది. చెలిమి కార్యక్రమం ద్వారా సమస్యలను పరిష్కరించే వినూత్న ఆలోచన శక్తి పిల్లల్లో పెరుగుతుంది. వేగంగా పురోగమిస్తున్న ప్రపంచంలో విద్యార్థి తనకు తానుగా సమాయత్తమయ్యేలా, నైపుణ్యాలు నేర్చుకొనేలా వాతావరణాన్ని కల్పిస్తున్నాం. ఇందుకోసం ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నాం. పైలట్‌ ప్రాజెక్టులో భాగంగా ఈ విద్యాసంవత్సరం నుండి ప్రతి జిల్లాలో ఒక్కో ఉన్నత పాఠశాలలో చెలిమి కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. ఇక అంకురం కార్యక్రమాన్ని పైలట్‌ ప్రాజెక్టుగా 8 జిల్లాల్లో 35 కేజీబీవీ, మోడల్‌ స్కూళ్లలో 11వ తరగతి విద్యార్థులకు ఈ విద్యాసంవత్సరం నుంచి అమలుచేస్తున్నాం. ఈ రెండు కార్యక్రమాలను తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ, ఉదయం శిక్ష, ఓక్‌నార్త్‌ ఇండియా, ఇంక్విలాబ్‌ ఫౌండేషన్‌, వై హబ్‌ సహకారంతో రూపకల్పన చేశాం. వచ్చే విద్యాసంవత్సరానికల్లామరిన్ని పాఠశాలలకు విస్తరిస్తాం’’ అని మంత్రి స్పష్టం చేశారు.

  • Related Posts

    AI: ఏఐ నేర్చుకోవాలనుకుంటున్నారా? ఈ ఐదు కోర్సులు పూర్తిగా ఉచితం

    ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ (AI) డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో విద్యా మంత్రిత్వ శాఖ మంచి అవకాశాన్ని కల్పించింది. దేశవ్యాప్తంగా విద్యార్థులు, ఉద్యోగులు, కొత్త నైపుణ్యాలు నేర్చుకోవాలనుకునే ప్రతి ఒక్కరికీ ఉపయోగపడే విధంగా ‘స్వయం పోర్టల్‌’ ద్వారా ఉచిత ఏఐ కోర్సులను( Free AI courses)…

    APPSC బంపర్ ఆఫర్.. కొత్త రిక్రూట్‌మెంట్ నోటీసులు విడుదల

    రాష్ట్ర నిరుద్యోగులకు శుభవార్త. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) త్వరలోనే భారీగా ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల( Notices Released) చేయనుంది. ప్రస్తుతం మొత్తం 18 నోటిఫికేషన్లు సిద్ధంగా ఉండగా, అందులో 12కుపైగా క్యారీ ఫార్వర్డ్ పోస్టులకు సంబంధించినవిగా తెలుస్తోంది. అయితే…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *