మన ఈనాడు: నగరంలోని కొత్తపేట శివాని ఉమెన్స్ డిగ్రీ కళాశాలలో ప్రైవేటు డిగ్రీ కళాశాలల యాజమాన్యం బుధవారం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గం సభ్యులను ఎన్నుకున్నారు. నూతన అధ్యక్షుడిగా రామంతాపూర్ స్ఫూర్తి మహిళా డిగ్రీ కళాశాల ఛైర్మన్ రాపర్తి సురేష్ గౌడ్ , ప్రధాన కార్యదర్శిగా భాస్కర్ నాయక్ , కోశాధికారిగా రమేష్ బాబును ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ప్రైవేటు డిగ్రీ కళాశాల యాజమాన్యం ప్రకటించింది.
ఉస్మానియా యూనివర్సిటీ అధ్యక్షుడు బాలకృష్ణారెడ్డి ఉస్మానియా యూనివర్సిటీ ప్రధాన కార్యదర్శి రామారావు పూర్వ అధ్యక్షులు సుదర్శన్ రెడ్డి నూతన కార్యవర్గ సభ్యులకు అభినందనలు తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలిపారు ఈ సమావేశంలో నూతన అధ్యక్షుడు రాపర్తి సురేష్ గౌడ్ మాట్లాడుతూ.. ప్రైవేటు డిగ్రీ కళాశాలపై ప్రభుత్వ చిన్నచూపు చూడొద్దని పేర్కొన్నారు తక్షణమే ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు తక్షణమే ఆఫ్లైన్ క్యాంపస్ ఆపివేయాలని బి బి ఏ, బి సి ఏ , బి ఎం ఎస్ కోర్సులకు సంబంధించి ఏఐసిటీ నుంచి మినహాయించాలని వారు తీర్మానం చేశారు.